Monday, December 23, 2024

రిజర్వేషన్ల రద్దు బిజెపి ప్రయత్నం:రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కుల గణన, ఆర్థిక సర్వేను చేపడుతుందని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. గుజరాత్‌లోని పటన్ పట్టణంలో సోమవారం ఆయన ఒక ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ దేశ జాభాలో 90 శాతం ఎస్‌సి, ఎస్‌టి, ఓబిసిలే ఉన్నారని తెలిపారు. అయితే కార్పొరేట్ కంపెనీలు, మీడియా, ప్రైవేట్ ఆసుపత్రులు, ప్రైవేట్ యూనివర్సిటీలలో కాని ప్రభుత్వ హోదాలలో కాని వారి ప్రాతినిధ్యం లేదని ఆయన అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కుల గణన, ఆర్థిక గణన మొట్టమొదటగా చేపడతామని ఆయన తెలిపారు. రాజ్యాంగాన్ని మార్చడానికి కేంద్రంలోని బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు. కేంద్రంలోని అధికార పార్టీ రిజర్వేషన్లకు వ్యతిరేకమని ఆయన ఆరోపించారు. దేశంలో నిరుద్యోగిత 45 శాతం పెరిగిందని రాహుల్ తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News