Friday, December 20, 2024

నిరసనల సెగ

- Advertisement -
- Advertisement -

Modi was shouted with go back slogans

మోడీకి వ్యతిరేకంగా ఎంఆర్‌పిఎస్ ఆందోళన, ప్రధాని బస చేసిన
నోవాటెల్‌లోకి దూసుకెళ్లేందుకు
కార్యకర్తల యత్నం
అగ్నిపథ్ ఉపసంహరించాలని
టిఆర్‌ఎస్‌వి, ఎంఎస్‌ఎఫ్ నిరసనలు
వర్గీకరణను వ్యతిరేకిస్తూ
మాల మహానాడు ధర్నా

మన తెలంగాణ /హైదరాబాద్ : కేంద్రంలోని మోడీ ప్ర భుత్వానికి నిరసనల సెగ తగిలింది. బిజెపి జాతీయ కా ర్యవర్గ సమావేశాలు జరుగుతున్న హైదరాబాద్‌లో ఎం ఆర్‌పిఎస్, మాలమహానాడు, టిఆర్‌ఎస్‌వి, మాదిగ స్టూ డెంట్ ఫెడరేషన్ (ఎంఎస్‌ఎఫ్), ఇతర దళిత సంఘాలు వేర్వేరు చోట్ల మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేశారు. ఎస్‌సి రిజర్వేషన్ల వర్గీకరణ కోరుతూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎంఆర్‌పిఎస్) కార్యకర్తలు బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల వేదిక నోవాటెల్ లోకి దూసుకెళ్ళేందుకు ప్రయత్నించారు. మరోవైపు ఎస్‌సిల వర్గీకరణకు వ్యతిరేకంగా మాలమహానాడు ట్యాంక్‌బండ్‌లోని అంబేద్కర్ వి గ్రహం వద్ద నిరసన తెలిపారు. కాగా అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా నిరసన తెలిపిన యువతపై బనాయించిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ టిఆర్‌ఎస్ విద్యార్థి విభాగం టిఆర్‌ఎస్‌వి, మాదిగ స్టూడెంట్స్ ఫెడరేషన్ (ఎంఎస్‌ఎఫ్), దళిత సంఘాలు ఆర్ట్ కాలేజీ వద్ద ప్ల కార్డులుతో నిరసన తెలిపారు.

కేంద్రంలో దళిత వ్యతిరేక ప్రభుత్వం

మోడీ నేతృత్వంలోని ప్రజా వ్యతిరేక, దళిత వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని ఎంఆర్‌పిఎస్ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఎస్‌సి రిజర్వేషన్ల వ ర్గీకరణకు బిజెపి సమావేశాల్లో తీర్మానం చేయాలని డి మాండ్ చేస్తూ ఎంఆర్‌పిఎస్ కార్యకర్తలు బిజెపి జాతీయ కార్యవర్గ సమావేవాల వేదిక అయిన నొవాటెల్ హోటల్‌లోకి దూసుకెళ్ళేందుకు ప్రయత్నించారు. ఆందోళన చేస్తున్న ఎంఆర్‌పిఎస్ కార్యకర్తలను సైబరాబాద్ పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ముందస్తుగా వారిని అదుపులోకి తీసుకున్నారు. కాగా ఎంఆర్‌పిఎస్ కార్యకర్తలు మోడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఓయులో విద్యార్థి సంఘాల నిరసనలు… ఉద్రిక్తత

అగ్నిపథ్ నిరసన కారులపై బనాయించిన కేసులను ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ టిఆర్‌ఎస్ విద్యార్థి విభాగం టిఆర్‌ఎస్‌వి, మాదిగ స్టూడెంట్స్ ఫెడరేషన్ (ఎంఎసెఫ్), దళిత బహుజన ఆర్గనైజేషన్స్ ఓయులో ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపాయి. ఈ సందర్భంగా ఆర్ట్ కాలేజీ విద్ద ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థులు “ గో బ్యాక్ మోడి ” అనే ప్లకార్డులు ప్రదర్శించారు. “ డౌన్ డౌన్ మోడి ” మోడి గో బ్యాక్ నినాదాలతో హోరెత్తించారు. అగ్నిపథ్ నిరసనకారులపై కేసులు నమోదు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. నరేంద్ర మోడి బహిరంగ సభలో ప్రసంగించడానికి ముందు విద్యార్థి సంఘాలు ఈ నిరసనకు పాల్పడ్డాయి. దేశవ్యాప్తంగా అగ్నిపథ్ నిరసన కారులపై బనాయించిన అన్ని రకాల కేసులు ఉపసంహరించాలని దాదాపు 55 మంది సికిందరాబాద్ నిరసన కారులుపై కేసులు నమోదు చేశారని, వారిపై కేసులు ఉపసంహరించాలని, అగ్నిపథ్ పథకాన్ని కూడా ఉపసంహరించాలని టిఆర్‌ఎస్‌వి అధ్యక్షులు జి.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో టిఆర్‌ఎస్‌వికి చెందిన 60 మంది పాల్గొన్నారని తెలిపారు. వారిలో 25 మందని పోలీసులు అరెస్టు చేశారు.

అనుకూల తీర్మానం చేస్తే జాగ్రత్త… మాలమహానాడు

ఎస్‌సి రిజర్వేషన్ల వర్గీకరణకు వ్యతిరేకంగా మాల మహానాడు ఆధ్వర్యంలో ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఎస్‌సి వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేస్తే దేశవ్యాప్తంగా బిజెపి పార్టీ మూల్యం చెల్లించుకోక తప్పదని మాలమహానాడు హెచ్చరించింది. మాలమహానాడు జాతీయ అధ్యక్షులు జి.చెన్నయ్య నేతృత్వంలో ధర్నా చేస్తున్న మాలమహానాడు కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సాయంత్రం విడుదల చేశారు. అరెస్టు అయిన వారిలో మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు జంగా శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన్నే శ్రీధర్ రావు, నాయకులు బంగి ఆనందరావు, కావలి రమేష్, దాసరి సత్యనారాయణ తదితరులు ఉన్నారు. మాలమహనాడు కార్యకర్తల అరెస్టును చెన్నయ్య తీవ్రంగా ఖండించారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేశారా అని ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News