- Advertisement -
గణతంత్ర వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ ధరించే తలపాగా ఎప్పుడూ వార్తల్లోకి వస్తూ ఉంటుంది. ప్రతి ఏటా రిపబ్లిక్ డే నాడు ఒక విభిన్నమైన తలపాగా ధరించడం ప్రధానికి అలవాటు. గత ఏడాది జోధ్ పురి పక్రంగి తలపాగా ధరించారు. ఈసారి ఆయన తెల్లటి కుర్తా పైజామా ధరించి, గోధుమ రంగు నెహ్రూ జాకెట్ ను వేసుకున్నారు. ఇక ఈసారి రంగురంగుల తలపాగా ధరించి, ప్రత్యేకంగా కనిపించారు. గణతంత్ర దినోత్సవం నాడు ఆయన మొదట నేరుగా యుద్ధవీరుల స్మారక స్థూపం వద్దకు వచ్చి నివాళులు అర్పించారు. అనంతరం రిపబ్లిక్ డే వేడుకలు జరుగుతున్న కర్తవ్యపథ్ కు వెళ్లారు.
- Advertisement -