Wednesday, December 25, 2024

వాస్తవ సమస్యలు మాట్లాడని మోడీ

- Advertisement -
- Advertisement -

ప్రియాంక గాంధీ విమర్శ

వయనాడ్(కేరళ): బిజెపి పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, ఎన్నికల ప్రచారంలో సైతం ప్రజల దృష్టిని వాస్తవ సమస్యల నుంచి మళ్లించడానికి ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపి నాయకులు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా బుధవారం ఆరోపించారు. తన సోదరుడు రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న కేరళలోని వయనాడ్ నియోజకవర్గంలో ఆమె ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ ధరల పెరుగుదల, నిరుద్యోగిత వంటి సమస్యలను పరిష్కరించడంలో మోడీ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.

దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి లోక్‌సభ ఎన్నికలు గొప్ప అవకాశమని ఆమె తెలిపారు. గత పదేళ్ల బిజెపి పాలనలో పెట్రోల్, డీజిల్, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయని ఆమె తెలిపారు. అదే విధంగా నిరుద్యోగ సమస్య పెరిగిందని ఆమె చెప్పారు. అయితే ప్రధాని మోడీ, బిజెపి నాయకులకు ఈ సమస్యలు పట్టవని ఆమె విమర్శించారు. అభివృద్ధి గురించి, వాస్తవ సమస్యల గురించి వారు మాట్లాడరని ఆమె అన్నారు. ప్రజల జీవితాలకు సంబంధం లేని కొత్త అంశాలను వారు తెరపైకి తెస్తుంటారని ఆమె విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News