Thursday, January 23, 2025

హిట్లర్‌లా ప్రవర్తిస్తే అదే చావు తప్పదు

- Advertisement -
- Advertisement -

మోడీపై సుబోధ్‌కాంత్ తీవ్ర వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: అగ్నిపథ్‌పై దేశంలో ఆందోళనలు, నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి సుబోధ్ కాంత్ సహాయ్ ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హిట్లర్‌లా ప్రవర్తించేవారికి ఆయనలాంటి చావే వస్తుందంటూ సహాయ్ ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోడీకి కూడా హిట్లర్‌లాంటి చావే వస్తుందంటూ సహాయ్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ స్పందిస్తూ ప్రధాని మోడీని సహాయ్ అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇటువంటి అప్రజాస్వామిక భాష మాట్లాడడం కాంగ్రెస్ డిఎన్‌ఎలోనే ఉందని ఆయన అన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ ఉన్న కాలంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మోడీని మృత్యు వ్యాపారిగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అభివర్ణించారని దాస్ గుర్తు చేశారు. అటువంటి భాష పట్ల గుజరాత్ ప్రజలు మనస్తాపం చెంది ఆ ఎన్నికల్లో మోడీని అఖండ మెజారిటీతో గెలిపించారని ఆయన తెలిపారు. వరుసగా రెండుసార్లు ప్రధానిగా ఎన్నికైన మోడీ మూడోసారి కూడా ప్రధాని అవుతారన్న నిస్పృహతోనే కాంగ్రెస్ నాయకులు ఆ విధంగా మాట్లాడుతున్నారని దాస్ వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News