Wednesday, January 22, 2025

2024 ఎన్నికల్లో మోడీ ఓటమి ఖాయం: శివసేన

- Advertisement -
- Advertisement -

ముంబై: వచ్చే ఏడాదిలో జరిగే లోక్‌సభ ఎన్నికల తర్వాత నరేంద్ర మోడీ మళ్లీ ప్రధాన మంత్రి పదవిని చేపట్టబోరని శివసేన(ఉద్ధవ్ థాక్రే వర్గం) నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ జోస్యం చెప్పారు. గురువారం నాడిక్కడ ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 2024 లోక్‌సభ ఎన్నికల కోసమే ప్రత్యేకంగా ప్రతిపక్ష ఇండియా కూటమి ఏర్పడిందని, 2024 లోసభ ఎన్నికలకు సంబంధించి వివిధ పక్షాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు.

2024 ఎన్నికలలో బిజెపి గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రసక్తే లేదని ఆయన ఆయన చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ 2024 ఎన్నికల తర్వాత మరోసారి ఆ పదవిని చేపట్టబోరని, కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడే ప్రసక్తి లేదని రౌత్ ధీమా వ్యక్తం చేశారు.

కేంద్ర ఎన్నికల సంఘం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ పెద్ద పార్టీ అని, ఎవరిని కలుపుకుని ముందుకు పోవాలో, ఎవరిని కలుపుకోవద్దో కాంగ్రెస్ పార్టీయే నిర్ణయిస్తుందని ఆయన అన్నారు.

ఇదిలా ఉండగా సీట్ల పంపకాలకు సంబంధించి ఇండియా కూటమిలో చర్చలు జరుగుతున్నాయని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సిపి) వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలె బుధవారం తెలిపారు. అనేక రాష్ట్రాలలో సీట్ల పంపకాలపై చర్చలు కొనసాగుతున్నాయని, చర్చలు ఆగలేదని ఆమె స్పష్టం చేశారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన పరిస్థితులు ఉన్నాయని, ఆయా రాష్ట్రాలలో పార్టీల మధ్య పొత్తులు భిన్నంగా ఉంటాయని ఆమె అన్నారు. ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయని ఆమె తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News