Monday, December 23, 2024

సమస్యలపై ప్రశ్నిస్తే ప్రధాని మోడీ వేగంగా చిరుతలా పారిపోతారు: ఓవైసీ

- Advertisement -
- Advertisement -

 

Asaduddin Owaisi

జైపూర్: మజ్లీస్- ఈ – ఇత్తేహాదుల్ ముస్లిమీన్(ఎంఐఎం) జాతీయ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ మొట్టమొదటిసారిగా రాజస్థాన్ లోని జైపూర్ లో ముస్లిం ప్రాబల్య ప్రాంతాలైన జాలుపురా, భట్టా బస్తీలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శనాస్త్రాలు సంధించారు. సమస్యలపై ఎదురయ్యే ప్రశ్నల నుంచి తప్పించుకునేందుకు ప్రధాని మోడీ చిరుతను మించి వేగంగా పరుగెత్తగలరని ఎద్దేవా చేశారు. ఆఫ్రికా దేశం నమీబియా నుంచి వచ్చిన చిరుతల నడుమ ప్రధాని మోడీ తన పుట్టినరోజు వేడుకలు చేసుకుంటున్న నేపథ్యంలో ఓవైసీ పైవిధంగా స్పందించారు.

“మీరు ఎప్పుడైనా మోడీని నిరుద్యోగం, లేక భగ్గుమంటున్న పెట్రోల్, డీజిల్ ధరలపై అడిగి చూడండి… ఆయన చిరుత కంటే వేగంగా పరుగు తీస్తారు. ఆయనను మేం ఆగమని చెబుతున్నాం. అడిగే ప్రశ్నలకు నిలిచి జవాబు ఇవ్వమంటున్నాం. భారత భూభాగంపై చైనా ఎలా దురాక్రమణలకు పాల్పడుతోందో చెప్పమంటున్నాం” అని ఓవైసీ వ్యాఖ్యానించారు. హాస్యం కూడా రాజకీయాల్లో భాగమేనని ప్రధాని మోడీ తన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో చెప్పారని, అందుకే ఆయనపై చిరుతపులి వ్యాఖ్యలు సరదాగా చేశానని అసదుద్దీన్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News