Monday, December 23, 2024

రూ.7వేల కోట్ల పనులకు శ్రీకారం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటన కోసం ఏర్పాట్లు చురుగ్గా సాగుతోన్నాయి. ఈనెల 19న హైదరాబాద్‌కు రానున్న ప్రధాని మోడీ దాదాపు రూ. 7 వేల కోట్ల వ్యయంతో చేపట్టనున్న వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయనున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో వందే భారత్ రైలును జెండా ఊపి ఆయన ప్రారంభించనున్నారు. దీంతో పాటు మరికొన్ని రైల్వే ప్రాజెక్టులకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు. సుమారు రూ. 700 కోట్ల వ్యయంతో చేపట్టనున్న స్టేషన్ ఆధునికీకరణ పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు.

అలాగే రూ.1410 కోట్ల వ్యయంతో సికింద్రాబాద్ – మహబూబ్ నగర్ మధ్య 85 కిలో మీటర్ల పొడవుతో నిర్మించిన డబుల్ లైన్‌ను జాతికి ఆయన అంకితం చేయనున్నారు. రూ.1850 కోట్ల వ్యయంతో చేపట్టనున్న మూడు జాతీయ రహదారి ప్రాజెక్టుల విస్తరణ పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. హైదరాబాద్ ఐఐటిలో రూ.2.597 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు నిర్మాణాలను ఆయన ప్రారంభించనున్నారు. అనంతరం కాజీపేటలో రూ.521 కోట్లతో నిర్మించనున్న రైల్ పీరియాడిక్ ఓవర్ హాలింగ్ వ్యాగన్ వర్క్ షాపుకు రిమోట్ ద్వారా ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు.

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రధాని మోడీ సభ

రాష్ట్రంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు ప్రధాని మోడీ వస్తున్న నేపథ్యంలో ఈనెల 19న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో బిజెపి భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనుంది. సోమవారం ప్రధాని పర్యనటకు సంబంధించిన ఏర్పాట్లు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో పదో నెంబర్ ప్లాట్‌ఫాంను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపి డాక్టర్ కె. లక్ష్మణ్ కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రైల్వే అధికారులతో వారు చర్చించారు.

ప్రధానమంత్రి పాల్గొనే కార్యక్రమాలకు సంబంధించి తీసుకోవల్సిన జాగ్రత్తలు, ఏర్పాట్లపై రైల్వే అధికారులకు పలు సూచనలను వారు చేశారు. అనంతరం బండి సంజయ్‌తో కలిసి ఎంపి లక్ష్మణ్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రయోజనాల విషయంలో సంకోచించకుండా ప్రధాని మోడీ పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. జాతీయ రహదార్లు నిర్మాణంలో దేశంలోనే తెలంగాణ రెండవ స్థానంలో ఉందన్నారు. తెలంగాణలో డబ్లింగ్, ఎంఎంటిఎస్, గేజ్ మార్పిడి పనులు పెద్ద ఎత్తున కేంద్రం చేపట్టిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News