Sunday, December 22, 2024

మోడీ మళ్లీ గెలిస్తే ఎన్నికలు ఉండవు: కోమటిరెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ బస్సు యాత్రతో వచ్చేది లేదు సచ్చేది లేదని కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఎద్దేవా చేశారు. జూన్ 4 తరువాత తెలంగాణ భవన్ ను మూసివేస్తారని, కెసిఆర్ దొంగ దీక్షలతో మళ్లీ డ్రామాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కెసిఆర్ సచ్చిన పాములాంటోడన్నారు. బుధవారం కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికలు చాలా కీలకమని, రాష్ట్రంలో కాంగ్రెస్ 14, 15 సీట్లు పక్కగా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఓట్ల కోసం బిజెపి చిల్లర రాజకీయాలు చేస్తోందని, రిజర్వేషన్లపై మోడీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ముస్లిం రిజర్వేషన్లు తిసివేస్తామని బిజెపి వారు మత కలహాలు రేపుతున్నారని దుయ్యబట్టారు.

మోడీ ఇస్తామన్న హామీలు ఇప్పటివరకు ఇవ్వలేదని, జిఎస్‌టి పేరుతో భారీ మోసం జరుగుతోందని, పదేండ్లు ప్రధాని ఉండి రాముడి పేరుతో ఓట్లు అడుక్కునే పరిస్థితి వచ్చిందని, ఎన్‌డిఎ కూటమి తమ టార్గెట్ అని, మళ్లీ మోడీ ప్రధాని అయితే దేశంలో ఎన్నికలు ఉండవని, రష్యా, చైనా లాగా భారత్ మారిపోతుందని హెచ్చరించారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఎక్కడ అని ప్రశ్నించారు. రాముడి పేరు మీద బిజెపి రాజకీయం చేయడం తగునా? అని అడిగారు.దేశ సంపద అదానీ అంబానీతో పాటు మరో ఇద్దరు చేతుల్లో ఉందన్నారు. జన్‌దన్ ఖాతాల్లో జీరో బ్యాలెన్స్ ఉందని, రూ.15 లక్షలు ఎందుకు పడలేదని, క్రూడాయిల్ ధరలు తగ్గినా పెట్రోల్, డీజిల్ ధరలు ఎందుకు తగ్గడం లేదని కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అడిగారు. ఎల్‌ఐసి ని ప్రైవేట్ పరం చేస్తామని బిజెపి అంటోందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News