- Advertisement -
న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో విజయం సాధించిన అభ్యర్ధులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎక్స్ ద్వారా అభినందనలు తెలిపారు. తెలంగాణకు చెందిన మల్క కొమరయ్య, అంజిరెడ్డిని ప్రధాని అభినందించారు. బిజెపికి మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రజలతో కలిసి పని చేస్తున్న ప్రతీ ఒక్క కార్యకర్తను చూసి గర్విస్తున్నానని మోడీ పేర్కొన్నారు. మరోవైపు ఎపిలో విజయం సాధించిన ఎమ్మెల్సీలకు శుభాకాంక్షలు తెలుపుతు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెట్టిన పోస్ట్‌ను మోడీ రీపోస్ట్ చేశారు. కేంద్రం, ఎపి ప్రభుత్వం ప్రజలకు సేవ చేస్తుందని.. రాష్ట్ర అభివృద్ధికి ప్రయాణాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తుందని మోడీ పేర్కొన్నారు.
- Advertisement -