Sunday, February 9, 2025

విజన్…వికాస్… విశ్వాస్

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ ప్రజలకు నా గ్యారెంటీ  ఇది చరిత్రాత్మక విజయం కాంగ్రెస్ మునుగుతూ
ఇతర పార్టీలనూ ముంచుతోంది అప్ అవినీతికి వ్యతిరేకంగా పుట్టి అవినీతిలో
కూరుకుపోయింది కార్యకర్తలను ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగం

న్యూఢిల్లీ: ఢిల్లీలోబిజెపి విజయం అంటే అది అభివృద్ధికి పట్టం కట్టడడమేనని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ప్రజలు అభివృద్ధి, ముందుచూపు, విశ్వాసానికి విజయాన్ని చేకూర్చని చెబుతూ ‘విజన్, వికాస్, విశ్వాస్’గా దానిని అభివర్ణించారు. ఢిల్లీ అ సెంబ్లీ ఎన్నికల్లో బిజెపి విజయం ఖాయం అయిన తర్వాత శనివారంనాడు రాత్రి ఇక్కడి బిజె పి ప్రధా న కార్యాలయంలో నరేంద్ర మోడీ కార్యకర్తలనుద్దేశించి ప్ర సంగించారు. ఢిల్లీ ప్రజలు ‘ఆప్‌ద’ పార్టీని సాగనంపి, డబుల్ ఇంజిన్ ప్రభుత్వానికి పట్టంకట్టారని అన్నారు. ఢిల్లీ ప్రజలు షార్ట్‌కట్ రాజకీయాలకు షార్ట్ సర్కూట్ ఇచ్చారన్నారు. ఢిల్లీ ప్రజలు ఢిల్లీని స్వంత ఆస్తిగా పరిగణించేవారిని తిరస్కరిం చి, ఢిల్లీకి తామే అసలైన యజమానులమని నిరూపించుకున్నారని మోడీ తెలిపారు. 26 ఏళ్లకు పైగా కాలం గడిచాక తిరిగి బిజెపి ఢిల్లీ అధికారాన్ని చేజిక్కించుకుందన్నారు. ‘దేశంలోని పాత పార్టీ అయి న కాంగ్రెస్ ఢిల్లీలో ఖాతా కూడా తెరువలేదు. ఇక్క డ జరిగిన గత ఆరు ఎన్నికల్లో (లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో) గెలువలేకపోయింది. కాంగ్రెస్ ఓ పరా న్న పార్టీ అని, అది మునుగుతూ ఇతరులను కూ డా ముంచుతుందని నేను ఇదివరకే అన్నాను. వారిది ప్రత్యేక పద్ధతి. వారు తమ ఎజెండానే దోచేస్తారు, ఆ తర్వాత ఓటు బ్యాంకును లక్షం చేసుకుంటారు. వారి ఓట్లను కొల్లగొడతారు’ అన్నారు. ‘అవినీతి, జడత్వ రాజకీయాలను తిరస్కరించిన ఢిల్లీ ఓటర్లు ఇక భవిష్యత్తు వైపు చూడొచ్చు. ఢిల్లీ ప్రజలకు నా గ్యారంటీ ఏమిటంటే సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సంపూర్ణ ఢిల్లీకా వికాస్’ అన్నారు. ‘నేటి కాంగ్రెస్ 1947 నాటి కాంగ్రెస్ కాదు. వారు అర్బన్ నక్సల్ రాజకీయాలు చేస్తున్నారు. వారు అరాచకం తీసుకొచ్చే దానిపై దృష్టి పెట్టారు. ఆప్‌ద కూడా అదే ప్రయత్నిస్తోంది’ అని మోడీ తన ప్రసంగంలో చెప్పుకొచ్చారు. ఇక ఆప్‌పైనా ప్రధాని విమర్శలు గుప్పించారు. అవినీతి వ్యతిరేక ఉద్యమంలోంచి పుట్టిన పార్టీ అవినీతిలో కూరుకుపోయిందన్నారు. ముఖ్యమంత్రి, డిప్యూటీ సిఎం, మంత్రులు జైలు పాలయ్యారని గుర్తు చేశారు. లిక్కర్ స్కామ్, స్కూల్ స్కామ్ సహా ఇతర కుంభకోణాలు ఢిల్లీ ప్రతిష్టను దిగజార్చాయని మోడీ దుయ్యబట్టారు. ఢిల్లీ ప్రజలు కొవిడ్‌తో బాధపడుతు ఉంటు వాళ్లు మాత్రం శీశ్ మహల్ నిర్మించుకున్నారని మండిపడ్డారు. ‘పొరుగున ఉన్న ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలు బిజెపినే ఎన్నుకున్నాయి. ఒకప్పుడు జంగల్ రాజ్ నడిచిన ఉత్తర్‌ప్రదేశ్‌లో నేడు శాంతిభద్రతలు మెరుగుపడ్డాయి. శాంతిభద్రతల పునరుద్ధరణకు మేము పనిచేశాము. మహారాష్ట్రలో రైతులు క్షామంతో వ్యథలు అనుభవించారు. మేము వారికి సాయపడేందుకు జల్‌యుక్త్ శిబిరం ఏర్పాటు చేశాము’ అన్నారు.

ప్రసంగాన్ని కాసేపు ఆపేసిన మోడీ.. కార్యకర్త ఆరోగ్యం గురించి వాకబు

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి విజయకేతనం ఎగురవేసింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ విజయోత్సవ కార్యక్రమంలో పా ల్గొన్నారు. ఆయన ప్రసంగిస్తున్నప్పుడు ఓ బిజెపి కార్యకర్త అస్వస్థతకు గురికావడంతో ప్రసంగాన్ని మధ్యలోనే కాసేపు ఆపేసి ఆయన ఆరోగ్యం గు రించి పరామర్శించారు. ‘ఆయనను చూడండి. ఆయన నిద్రపోతున్నాడా, లేక అస్వస్థతతో ఉన్నా డా? దయచేసి డాక్టరును పిలిపించి చూయించండి. ఆయనకు కాస్త నీళ్లు త్రాగించండి. బహు శా అస్వస్థతో ఉన్నట్లున్నాడు. జాగ్రత్తగా చూసుకోండి’ అంటూ వేదిక మీది నుంచే మోడీ అన్నా రు. ఆ తర్వాత ఆ బిజెపి కార్యకర్త బాటిల్ నీళ్లు త్రాగి, తాను బాగున్నట్లు సూచన చేశాక, మోడీ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 స్థానాల్లో బిజెపి 48 స్థానా లు గెలుచుకోగా, ఆమ్ ఆద్మీ పార్టీ 22 స్థానాలు గెలుచుకుందన్నది గమనార్హం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News