Thursday, January 23, 2025

దేశంలో విదానాలన్నీ మోడీ ఇద్దరు మిత్రుల కోసమే : ప్రియాంక గాంధీ

- Advertisement -
- Advertisement -

Priyanka gandhi election campaign in UP

 

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వం లోని ప్రభుత్వంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ విరుచుకు పడ్డారు. దేశంలో ప్రస్తుతం రూపొందుతున్న విధానాలన్నీ మోడీ ఇద్దరు మిత్రుల ప్రయోజనం కోసమేనని ఆరోపించారు. ఉత్తరాఖండ్ శాసన సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె శనివారం ఖటిమా సిటీలో ఓ బహిరంగ సభలో మాట్లాడారు. ముఖ్యమంత్రి నుంచి ప్రధాని వరకు బీజెపి నేతలంతా తమ స్వార్థ ప్రయోజనాల కోసమే పని చేస్తున్నారని , వారికి ప్రజల గురించి పట్టదని ఆరోపించారు. దేశంలో కరోనా పెరగడానికి కాంగ్రెస్ కారణమని మోడీ ఆరోపించారని, కాంగ్రెస్ నేతలు ,కార్యకర్తలు కేవలం తమ కర్తవ్యాన్ని మాత్రమే నిర్వహించారని పేర్కొన్నారు.

అష్టదిగ్బంధనం అమలైన సమయంలో వలస కూలీలు రోడ్లపై నడుచుకుంటూ వెళ్లారని, వారికి ఎలాంటి సదుపాయాలు లేవని గుర్తు చేశారు. వాళ్లని అలాగే వదిలేయాలా ? మేం రాజకీయాలు చేశామా ?అని ఆమె ప్రశ్నించారు. ఉత్తరాఖండ్‌లో ఉపాధి అవకాశాలు లేనందువల్ల ఎక్కువ మంది ప్రజలు వలస పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రంలో హిమాలయాలు, ప్రకృతి పర్యాటక అవకాశాలు ఉన్నాయని, కానీ ఉపాధి మాత్రం లేదని ఆరోపించారు. దేశ వ్యాప్తంగా విధానాలన్నీ కేవలం ఇద్దరు పారిశ్రామిక వేత్తల కోసం రూపొందుతున్నాయని, ఆ ఇద్దరూ మోడీకి మంచి మిత్రులని వ్యాఖ్యానించారు. బడ్జెట్‌లో రైతులు మధ్యతరగతి వర్గాలు, పేదల కోసం ఏమీ లేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News