Thursday, January 23, 2025

పార్టీకి మోడీ రూ. 2000 విరాళం

- Advertisement -
- Advertisement -

వికసిత్ భారత్‌కు చేయూత పిలుపు

న్యూఢిల్లీ : బిజెపి ఎన్నికల ప్రచార నిధికి ప్రధాని నరేంద్ర మోడీ చందా రూ. 2000. ఎన్నికలకు ముందు ఆయన ఈ డబ్బును పార్టీ ఖాతాలోకి జమచేశారు. పార్టీ నిధికి తాను ఈ మొత్తం అందిస్తున్నానని, మిగిలిన వారంతా కూడా తమ శక్తి మేరకు విరాళాలు సమర్పించుకోవాలని ఆయన పిలుపు నిచ్చారు. దేశ నిర్మాణ ఉద్యమం పేరిట ఓ కార్యక్రమాన్ని బిజెపి ఇటీవలే చేపట్టింది. దీనికి ఆదివారం పిఎం నుంచి ఈ మేరకు ఫండ్ చేరింది. దేశం ముందుకు సాగాల్సి ఉంది. ఇందుకు అవసరం అయిన అనివార్య ఘట్టం వచ్చింది.

దీనిని గుర్తించి ఎన్నికల్లో ప్రచార వ్యయానికి అవసరం అయిన నిధులను ప్రజలంతా సమకూర్చాల్సి ఉందని ఎక్స్ సామాజిక మాధ్యమం ద్వారా ప్రధాని స్పందించారు. నమో యాప్ ద్వారా అంతా ఇందులో భాగస్వామ్యం కావల్సి ఉందని కోరారు. వికసిత్ భారత్ దిశలో తాను తన వంతు విరాళానికి దిగిన విషయాన్ని కూడా ప్రధాని ప్రస్తావించారని బిజెపి సెంట్రల్ ఆఫీసు ఓ ప్రకటనలో తెలిపింది.

బిజెపికి రూ 719 కోట్ల విరాళాలు
గడిచిన 2022 23 సంవత్సరంలో బిజెపికి వివిధ రూపాలలో రూ 719 కోట్ల మేర విరాళాలు అందాయి. ఇతర పార్టీలతో పోలిస్తే అధికారికంగా అందిన ఈ మొత్తం ఇతర పార్టీలతో పోలిస్తే అధికం. కాగా గడిచిన ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 17 శాతం ఎక్కువ అని లెక్కల ప్రకారం నిర్థారించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News