Sunday, January 19, 2025

నిరుపేదల సంక్షేమమే మోడీ లక్ష్యం

- Advertisement -
- Advertisement -

ఫరూఖ్‌నగర్ : నిరుపేదల సంక్షేమే ప్రధానమంత్రి నరేంద్రమోడీ లక్షమని తొమ్మిదేండ్ల బిజెపి పాలనలో దేశంలోని బడుగు బలహీణ వర్గాల అభ్యున్నతికై అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చారని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, షాద్‌నగర్ నియోజకవర్గ ఇంచార్జీ నెల్లి శ్రీ వర్థన్‌రెడ్డి కొనియాడారు.

శుక్రవారం మండల పరిధిలోని మొగిలిగిద్ద గ్రామంలో మహాజన సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వ హించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రజలకు ప్రభుత్వ పథకాలను వివరిస్తూ, రాష్ట్రంలో బిఆర్‌ఎస్ పాలన వైఫల్యాలను ఎండగడుతూ, ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రభు త్వాన్ని డిమాండ్ చేశారు.

పల్లెల, పట్టణాల అభివృద్ధికి అనేక నిధులను కేంద్రం ప్రభుత్వం అందజేస్తుంటే బిఆర్‌ఎస్ ప్రభుత్వం మాత్రం నిధులను దుర్వినియోగానికి పాల్పడుతుందని విమర్శించారు. రానున్న రోజుల్లో బిఆర్‌ఎస్ నిరంకుశ ప్రభుత్వాన్ని గద్దె దింపుదామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధికార ప్రతినిధి కక్కునూరి వెంకటేష్‌గుప్త, నేతలు కిషోర్‌రెడ్డి, హన్మంతు,భరత్, రఘు, నర్సింలు, శ్రవణ్, గిరి, నరేందర్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News