Friday, November 15, 2024

పార్లమెంట్ నూతన భవనాన్ని మోడీ ప్రారంభించడం రాజ్యాంగ విరుద్ధం

- Advertisement -
- Advertisement -
  • బిజెపి కక్షసాధింపు చర్యలు సరికాదు
  • ఏకపక్ష నిర్ణయాలతో కేంద్ర బిజెపి
  • ప్రతిపక్ష పార్టీల నేతలపై కక్ష సాధింపు
  • ఈడి, ఐటి దాడులతో భయాందోళనలకు గురి చేయడం సరికాదు
  • జూన్ 4న కొత్తగూడెంలో సిపిఐ గర్జన విజయవంతం చేయాలి
  • సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి

హుస్నాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటూ ప్రశ్నించే ప్రతిపక్ష పార్టీల నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం తగదని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని అనభేరి సింగిరెడ్డి అమర్ల భవన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం ప్రధాని మోడీ ఆధ్వర్యంలో ప్రతిపక్షాలపై ఐటి, ఈడి అధికారులచే దాడులు నిర్వహిస్తూ భయాందోళనలకు గురి చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.

నూతనంగా నిర్మించిన భారత పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి చే ప్రారంభించాల్సి ఉండగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన హామీలు డబుల్ బెడ్రూం ఇల్లు, ఇళ్ల స్థలాలు, నిరుద్యోగ భృతి తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇచ్చిన హామీలు అమలు చేసేంతవరకు సిపిఐ ప్రజా పోరాటాలు కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. జూన్ 4న కొత్తగూడెంలో నిర్వహించనున్న సిపిఐ గర్జన సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు ప్రజలకు పిలుపునిచ్చారు.

అనంతరం మండలంలోని తోటపల్లి మందాపూర్ గ్రామాలకు చెందిన సిపిఐ సీనియర్ నాయకులు పొదిల రాజనర్సు, పిట్టల వెంకటస్వామి మృతిచెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి మంద పవన్, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు హుస్నాబాద్ మాజీ వైస్ ఎంపిపి గడిపె మల్లేశ్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎడల వనేష్, జాగీర్ సత్యనారాయణ, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు బద్దిపడగ రాజారెడ్డి, అయిలేని సంజివరెడ్డి, ఏగ్గొజు సుదర్శన్ చారి, కొహెడ కొమురయ్య, ననువాల ప్రతాప్ రెడ్డి, బైరగొని సరోజన, చిగురుమామిడి సిపిఐ మండల కార్యదర్శి నాగేల్లి లక్ష్మారెడ్డి, కోహెడ మండల కార్యదర్శి ముంజ గోపి, భారత జాతీయ మహిళా సమాఖ్య రాష్ట్ర నాయకురాల్లు గూడెం లక్ష్మి, జిల్లా అధ్యక్షురాలు గూడ పద్మ,ఏలురి స్వాతి, సిపిఐ మండల నాయకులు అయిలేని మల్లారెడ్డి, పోదిల కనకస్వామి, ఇజ్జగిరి కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News