Monday, December 23, 2024

పిఎం, మంత్రుల ఆస్తులను ప్రకటించిన ప్రధానమంత్రి కార్యాలయం

- Advertisement -
- Advertisement -

 

 

Modi Assets

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి కార్యాలయం నుండి వచ్చిన తాజా ప్రకటనలో, 2021-22లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చరాస్తులు రూ. 26 లక్షలకు పెరిగాయి – మార్చి 2021 చివరి నాటికి రూ. 1,97,68,885 నుండి రూ. 2,23,82,504కి మార్చి 31, 2022 నాటికి పెరిగాయి. గుజరాత్‌లోని రెసిడెన్షియల్ ప్లాట్‌లో తన వాటాను విరాళంగా ఇచ్చిన తర్వాత ఆయనకు ఇకపై ఎటువంటి స్థిరాస్తి లేదు. స్థిరాస్థుల విభాగంలో ప్రధాని ‘నిల్’ అని పేర్కొన్నారు. “స్థిర ఆస్తి సర్వే నెం. 401/A మూడు ఇతర జాయింట్ ఓనర్‌లతో సంయుక్తంగా నిర్వహించబడింది , ప్రతి ఒక్కరికి 25% సమాన వాటా ఉంది, అది విరాళంగా ఇవ్వబడినందున ఇకపై  స్వంతం కాదు” అని జాబితా కింద ఒక గమనిక ఉంది. 2002లో తాను కొనుగోలు చేసిన రెసిడెన్షియల్ ప్రాపర్టీని మోడీ గత ఏడాది ప్రకటించారు, అందులో నాలుగో వంతు వాటా మాత్రమే ఉంది. ఆస్తి మార్కెట్ విలువ రూ.1.10 కోట్లు.

చరాస్తుల విశ్లేషణ ప్రకారం చేతిలో ఉన్న నగదు గతేడాది రూ. 36,900 నుండి రూ. 35,250కి స్వల్పంగా తగ్గింది.  ఒక నివేదిక ప్రకారం, ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ మార్చి 31, 2021 నాటికి  రూ. 1,52,480నుండి  నుండి రూ. 46,555కు తగ్గింది.నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (రూ. 8.9 లక్షలు), రూ. 1.5 లక్షల విలువైన జీవిత బీమా పాలసీలు, ఎల్ అండ్ టీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బాండ్‌ల రూపంలో మోదీ పెట్టుబడులు పెట్టారని, వీటిని 2012లో రూ. 20,000కు కొనుగోలు చేశారని హిందుస్థాన్ టైమ్స్ 2021లో తన నివేదిక పేర్కొంది.అతని డిక్లరేషన్‌లో ఏడాది క్రితం రూ.1.48 లక్షల విలువైన నాలుగు బంగారు ఉంగరాలు కూడా ఉన్నాయి.

పిఎంఓ వెబ్‌సైట్‌లో 10 మంది కేంద్ర మంత్రుల ఆస్తుల ప్రకటన కూడా ఉంది. కేంద్ర మంత్రులలో, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆస్తులు మార్చి 31, 2022 నాటికి రూ.2.24 కోట్ల నుంచి రూ.2.54 కోట్లకు చేరాయి.

విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నికర ఆస్తుల విలువ మార్చి 31, 2022 చివరి నాటికి రూ. 1.62 కోట్ల నుండి రూ. 1,83 కోట్లకు పెరిగింది.

పశుసంవర్థక శాఖ మంత్రి పర్షోత్తమ్ రూపాల నికర విలువ రూ.7.29 కోట్లు, గత ఏడాదితో పోలిస్తే రూ.1.42 కోట్లు పెరిగింది. విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మార్చి 31, 2022 నాటికి మొత్తం ఆస్తులు రూ. 35.63 కోట్లు, అప్పులు రూ. 58 లక్షలుగా నివేదించారు. సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి మొత్తం ఆస్తుల విలువ రూ. 1.43 కోట్లుగా ప్రకటించారు.

అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో, పబ్లిక్ డొమైన్‌లో పారదర్శకతను కొనసాగించడానికి ప్రతి ఆర్థిక సంవత్సరం చివరి నాటికి కేంద్ర మంత్రులందరూ తమ ఆస్తులను ప్రకటించాలని నిర్ణయించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News