Thursday, December 19, 2024

తొమ్మిదేళ్ల మోడి పాలన ప్రపంచానికే ఆదర్శం

- Advertisement -
- Advertisement -

ముషీరాబాద్ ః దేశంలో ప్రధాని నరేంద్ర మోడి 9 ఏళ్ల పాలన ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందని రాజ్యసభ సభ్యులు, బిజేపి ఓబిసి విభాగం జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె. లక్ష్మణ్ అన్నారు. దేశ వ్యాప్తంగా ప్రజల సంక్షేమం కోసం రూ. 27 లక్షల కోట్లు ఖర్చు చేశారని ఆయన గుర్తు చేశారు. బిజేపి ముషీరా బాద్ నియోజకవర్గ మేధావుల సమావేశం కవాడిగూడ డివిజన్ బండమైసమ్మ కమ్యూనిటీ హాల్లో శనివారం నిర్వహించారు.

రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె. లక్ష్మణ్, కార్పొరేటర్ రచనశ్రీ నేతృత్వంలో రిటైర్డ్ నేవి ఉద్యోగి కెప్టెన్ సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు రిటైర్డ్ నేవి ఉద్యోగులు, రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగులు బిజేపి పార్టీలో చేరారు. అనంతరం లక్ష్మణ్ మాట్లాడుతూ కేంద్రంలో బిజేపి ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు భావితరాలకు దిక్సూచిగా నిలిచాయన్నారు. దేశంలో అనేక ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కాశ్మీర్, రామమందిర నిర్మాణం సమస్యతో పాటు త్రిపుల్ తలాక్ చట్టాన్ని తీసుకొ చ్చిన ఘనత ప్రధాని మోడికే దక్కుతోందన్నారు.

కరోనా సమయం నుంచి దేశ వ్యాప్తంగా నిరుపేదలకు రూ.6 కిలోల చొప్పున ఉచితంగా అందజేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో నియంతృత్వ, అవినీతి పాలనను అంతం చేసేందుకు మేధావులు, కవులు, కళాకారులు ఏకమై బిఆర్‌ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు రచన శ్రీ, కె. రవిచారి, బిజేపి ముషీరాబాద్ నియోజకవర్గ కన్వీనర్ ఎం. రమేష్ రాం, రాష్ట్ర నాయకులు జి. వెంకటేష్, ఓబిసి మోర్చ అధ్యక్షులు సలాంద్రి శ్రీనివాస్ యాదవ్, డివిజన్ అధ్యక్షులు మహేందర్ బాబు, కార్య దర్శులు ఎ.ప్రభాకర్, కేశ వరాజు, నవీన్‌గౌడ్, వినయ్‌కుమార్, పరిమళ్ కుమార్, శ్రీనివాస్ ముదిరాజ్, పిఎన్ చారి, గంట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News