Sunday, December 22, 2024

మోడీ ప్రగతి నివేదికను విస్తృతంగా ప్రచారం చేయాలి

- Advertisement -
- Advertisement -

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం గత 9 ఏళ్లుగా చేస్తున్న అభివృద్ధిని, సంక్షేమ పథకాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని రాజ్యసభ సభ్యులు, బిజెపి ఓబీసీ సెల్ విభాగం జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ముషీరాబాద్ నియోజకవర్గ సంయుక్త మోర్చాల సమ్మేళనం భోలక్‌పూర్‌లోని హెరిటేజ్ ఫంక్షన్ హాల్లో జరిగింది. బిజెపి ముషీరాబాద్ నియోజకవర్గ కన్వీనర్ రమేష్ రాం అధ్యక్షతన జరిగిన ఈ సమ్మేళనానికి డాక్టర్ లక్ష్మణ్‌తో పాటు బిజెపి రాష్ట్ర నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి, కార్పొరేటర్లు రచనశ్రీ, పావని వినయ్ కుమా ర్, సుప్రియా నవీన్ గౌడ్, మహంకాళి జిల్లా అధ్యక్షులు శ్యాంసుందర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి సికే శంకర్‌లు ప్రసంగించారు.

డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడు తూ రానున్న పార్లమెంటు ఎన్నికల్లో మోడీ మూడోసారి ప్రధాని కావడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను లబ్ధిపొందిన లబ్ధిదారులకు, ప్రజలకు ఇంటింటికి వెళ్లి వివరించాలన్నారు. దేశ వ్యాప్తంగా 4 కోట్ల ఇండ్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయగా, తెలంగాణ రాష్ట్రంలో 2.50 లక్షల ఇండ్లకు కేంద్రం మంజూరు చేసిందన్నారు. కేంద్ర మంత్రి వర్గంలో 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందినవారినే ఎంపిక చేసి సామాజిక న్యాయం పాటించినట్టు తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలోనూ అన్ని వర్గాలకు సామాజిక న్యాయం దక్కాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే సాధ్యం అవుతోందన్నారు. తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావడానికి ముషీరాబాద్ నియోజకవర్గం నాంది కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. బిజెపి సీనియర్ నాయకులు మద్దూరి శివాజీ, భరత్ గౌడ్, సలాంద్రి శ్రీనివాస్ యాదవ్, ప్రఫూల్ రాంరెడ్డి, నవీన్ గౌడ్, వినయ్‌కుమార్, జి. వెంకటేష్, బద్రీనారాయణ, పూస రాజు, పద్మజ, మాధవి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News