- రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అభివృద్ధి
- 140 కోట్ల మంది భారతీయులే మోడీ కుటుంబం
- కాంగ్రెస్ హయంలో రోడ్ల నిర్మాణం నాణ్యత తక్కువ… అవినీతి ఎక్కువ
- కేంద్ర మాజీ మంత్రి, ఎంపి, జాతీయ రోడ్డు నిర్మాణ పనుల ఇంచార్జి ప్రకాష్ జవదేకర్
కోహెడ: అవినీతికి తావులేకుండా… పారదర్శకంగా నరేంద్ర మోదీ పాలనను అందిస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి, ఎంపి, జాతీయ రోడ్డు నిర్మాణ పనుల ఇంచార్జీ ప్రకాష్ జవదేకర్ అన్నారు. మహాజన్ సంపర్క్ అభియాన్, వికాస్ తీర్థ కా ర్యక్రమ నిర్వహణలో భాగంగా మెదక్ నుండి ఎల్కతుర్తి జాతీయ రహదారి నిర్మాణం పనులను సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని సముద్రాల గ్రామంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపి బండి సంజయ్‌తో కలిసి, ప్రకాష్ జవదేకర్ పరిశీలించారు. ఆ తర్వాత విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడు తూ… బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపి బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ప్ర జాధారణ పొందిందని తెలిపారు.
తెలంగాణ రా ష్ట్రంలో బండి సంజయ్ నేతృత్వంలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశా రు. ప్రధాని నరేంద్ర మోదీ 9 ఏండ్ల పాలనలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు చేపట్టారని వెల్లడించా రు. కేంద్రం నిధులతో తెలంగాణ రాష్ట్రం చాలా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. నేషనల్ హైవే 765 పనులను ప్రారంభించామని, పనులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నామని తెలిపారు. రా ష్ట్రంలో రహదారులను జాతీయ రహదారులుగా తీర్చిదిద్దాని మీ ఎంపి బండి సంజయ్.. కేంద్రమంత్రి నితిన్ గడ్కారీని పలుమార్లు కలసి కోరినట్లు గుర్తు చే శారు. సిద్దిపేట, హుస్నాబాద్, ముల్కనూర్, ఎల్కతూర్తి 4 వరుసల జాతీయ రహదారి వీలైనంత త్వ ర లో పూర్తికాబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ హయాంలో రోడ్డులు వేస్తే రెండు సంవత్సరాలకే ధ్వంసం అయ్యేవని ఆరోపించారు. బిజెపి ప్ర భుత్వం అటల్ బిహారి వాజ్‌పేయి గ్రామీణ సడక్ యోజన పథకం ద్వారా నాణ్యత, గ్యారంటీతో కూ డి న రహదారుల నిర్మాణం చేపట్టేవిధంగా చర్యలు చేపట్టినట్లు గుర్తుచేశారు. ఆనాడు మంత్రిగా ఉన్న వెంకయ్య నాయుడు రోడ్ల నిర్మాణం పై ప్రత్యేక నిబంధనలు రూపొందించి… రోడ్ల నిర్మాణం చేపట్టిన అన ంతరం 5 సంవత్సరాల వరకు మెయింటనెన్స్ చూసుకునే బాధ్యత సంబంధిత కాంట్రాక్టర్‌పై ఉండేవిధం గా ఒప్పందం ఉందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్ర భుత్వంలో రోడ్ల నిర్మాణం నాణ్యత తక్కువ… అవినీతి ఎక్కువ జరిగిందని మండిపడ్డారు.2014 నుండి 2023 వరకు 2500 కిలోమీటర్ల నేషనల్ హైవేలుగా అభివృద్ధి చేశామన్నారు.
ప్రధాని మోడీ అవినీతికి తావులేకుండా తొమ్మిది సంవత్సరాలు పరిపాలన కొనసాగినట్లు ధీమా వ్యక్తం చేశారు. 1.90 వేల కోట్ల నిధులతో తెలంగాణలో రహదారుల అభివృద్ధి కి కే టాయించామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కు టు ంబ పాలనతో భ్రష్టుపట్టి పోయిందని తీవ్రస్థాయ లో విమర్శలు గుప్పించారు. భారతదేశంలోని 130 కోట్ల మంది మోడీ కుటుంబం అని స్ఫష్టం చే శారు. బిజెపి ప్రభుత్వం ద్వారా లబ్ధిచేకూరిన కార్యకర్తలు, ప్రజలు లబ్ధిపొందిన అంశాలపై ఒక చిన్న విడియో చేసి బిజె పి అధికార వాట్సాప్ నెంబర్‌కు పోస్ట్ చేయాలని ప్రకా ష్ జవదేకర్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ ప్రభాకర్, సిద్దిపేట, కరీంనగర్, హన్మకొండ జిల్లాల బిజెపి అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి, గంగిడి కిష్టారెడ్డి, రా వు పద్మ, పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొమటిరెడ్డి రాంగోపా ల్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ హౌజ్‌ఫెడ్ మాజీ చైర్మన్ బొమ్మ శ్రీరాం చక్రవర్తి, నాయకులు జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి, గు జ్జ సత్యనారాయణ, సంతోష్, గుర్రాల లకా్ష్మరెడ్డి, వేణుగోపాల్ రావు, బిజెపి కోహెడ మండల అధ్యక్షుడు ఖమ్మం వెంకటేశం, తీగలకుంటపల్లి సర్పంచ్ మ్యా కల చంద్ర శేఖర్ రెడ్డి, ఎంపిటిసి ద్యాగటి సురేందర్, నాయకులు పిల్లి నర్సయ్య గౌడ్, జాలిగం రమేష్, అక్కు శ్రీనివాస్, కొమటి సత్యనారాయణలున్నారు.