Thursday, January 23, 2025

కొమ్మ కొమ్మకో సన్నాయి…

- Advertisement -
- Advertisement -

Moduga flower uses in Telugu

కొమ్మ కొమ్మకో సన్నాయి.. ఆకులు మాత్రం లేవు.. పుష్పాలు మాత్రం విరివిగా పూచాయి. ప్రకృతి అంఆలు ప్రజల ను కనువిందు చేస్తున్నాయి. హోలి పండుగ వస్తుందంటే చాలు అందరికి గుఉ్తకు వచ్చేది మోదుగుపూల అందాలు. వ్యవసాయ క్షేత్రాల్లో .. అడవుల తో పాటు రహదారులకు ఇరువైపులా ఉన్న మో దుగుపూల అందాలను చూసి ప్రకృతి ప్రేమికులు మైమరచిపోతున్నారు.ప్రస్తుత పోటి ప్రపంచంలో జీవన విధానం కంప్యూటర్‌తో పోటి పడుతున్న త రుణంలో ప్రకృతి అందాలను అస్వాదించేందుకు వీలు లేకుండా పోయింది.యాంత్రిక జీవానానికి అలవాటు పడిన ప్రజల మనస్సులను అహ్లదపరిచే గుణం కేవలం ప్రకృతికే ఉం దని చెప్పవచ్చు .గ్రామీణ ప్రాంతాలో ప్రకృతి అందాలను అ స్వాదిస్తూ యువత తమ మొబై ల్ ఫోన్‌లలో ఫోటోల ను సెల్పీలను తీసుకోని ఆనందంగా గడుపుతన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజక వర్గంలోని కమ్మదానం, మామిడిపల్లి, బూర్గుల గ్రామ పంచాయితీలలో మోదుగుపూలు విరబూసి రోడ్డుకు ఇరువైపులా ఉన్న మోతుగుపూలను చూచి వచ్చిపోయే వారిని ఆకర్షిస్తున్నాయి.

రహదారుల పై వేళ్లే ప్రయాణికులు, ప్రజ లు కొద్ది సేపు మోతుగుపూలను చూచి అలసిన మనస్సు లో సేద తీర్చుకుంటు ముందుకు సాగుతున్నారు. మోతుగుపూ లు వేదజల్లే వాసనతో ప్రజలు, ప్రయాణికులు, తుమ్మెదలు పూలలో ఉన్న తాగుతున్నాయి. ఈ ప్రకృతి అందాలను చూచిన వారు ఎంతటివారైన దాసోహం అవాల్సిందే. రంగుల తయారీ.. ప్రకృతిలో దోరికే వివిధ రకాల పూలను ఎండబెట్టి పొడి గా చేసి,పెస్టుగా చేసి రంగులుగా ఉపయోగిస్తున్నారు. గులాబీ రేకులను పెస్టు చేసి నీల్లలో కలిపి గులాబీ రంగుగా వాడుతున్నారు.గ్రీన్ కలర్‌కోసం గోరింటాకు ,ఆ రంజ్ కోసం ప్రకృతిలో దోరికే వివిద రకాల పూ లను తీసుకోని నానాబెట్టి పెస్టుచేసి కలర్‌గా కలపుకోని వాడితే చర్మ వ్యాధులు రాకుండా ఉంటాయని పలువురు అభిప్రాయ పడుతున్నారు. హోలికి రెండు రోజుల ముందు ప్రకృతిలో దొరికే పూల వల్ల ఎలాంటి చర్మవ్యాధులు రావాని నిపుణులు పేర్కొంటున్నారు.

రూ.2000, 500, 200ల రూపాయల నోట్లు హోలీలో వాడొద్దు…ఆర్‌బిఐ నిబంధనల ప్రకారం హోలీ పండుగ రోజున 200, 500, 2000ల రూపాయల నోట్లను హోలీ ఆడే వ్యక్తులు ఆ నోట్లను దగ్గర ఉంచుకోని వాటిపై రంగులు పడితే ఈ నోట్లు చెల్లబడవు అని గత కోన్ని రోజులుగా బ్యాంకు సిబ్బంది, సోషల్ మిడియాలో ప్రకటనలు రావడం జరగుతుందని దీనిని దృష్టిలో ఉంచుకోని ఈ నోట్లను హోలి రోజు వాడకూడదని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News