Friday, September 20, 2024

రాజ్యసభ సెక్రటరీ జనరల్‌గా పిసి మోడీ నియామకం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సిబిడిటి) మాజీ చైర్మన్ పిసి మోడీ శుక్రవారం రాజ్యసభ సెక్రెటరీ జనరల్‌గా బాధ్యతలు చేపట్టారు. మూడు నెలల క్రితమే నియమితులైన పిపికె రామాచార్యులు స్థానంలో పిసి మోడీ నియమితులయ్యారు. సెక్రెటరీ జనరల్‌గా మోడీని నియమిస్తూ శుక్రవారం రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్య నాయుడు ఆదేశాలు జారీచేసిన కొద్ది గంటల్లోనే ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. క్యాబినెట్ కార్యదర్శి హోదాలో రాజ్యసభ సెక్రెటరీ జనరల్ వ్యవహరిస్తారని రాజ్యసభ సచివాలయం ఒక ప్రకటనలో తెలిపింది. 2022 ఆగస్టు 10వ తేదీ వరకు కాంట్రాక్టు పద్ధతిలో ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. ఇలా ఉండగా..రామాచార్యులును రాజ్యసభ సచివాలయంలో సలహాదారుగా నియమించినట్లు మరో ప్రకటనలో సచివాలయం తెలిపింది. కాగా..తాజా పరిణామాలపై కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు జైరామ్ రమేశ్ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. వృత్తిరీత్యా నిష్ణాతుడు, నిష్పక్షపాతి, విద్యాధికుడు అయిన డాక్టర్ పిపికె రామాచార్యులును ఈ పదవి నుంచి తప్పించడం ఆశ్చర్యం కలిగించలేదని, ఆయనకు ఉన్న ఈ మూడు గొప్ప అర్హతలే మోడీ పాలనలో అత్యంత ఘోర పాపాలంటూ జైరామ్ రమేశ్ ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News