న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఉండే ‘మొఘల్ గార్డెన్స్’కు ‘అమృత్ ఉద్యాన్’ అని కొత్త పేరు పెట్టారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు కావొచ్చే సందర్భంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ ను పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ కొత్త నామకారణం చేశారు. అయితే రాష్ట్రపతి భవన్ వెబ్‌సైట్ మాత్రం ఇప్పటికీ ‘మొఘల్ గార్డెన్స్’ , ‘అమృత్ ఉద్యాన్’ అని రెండు పేర్లతో పిలుస్తోంది. రాష్ట్రపతి భవన్‌లో మూడు ఉద్యానవనాలు ఉంటాయి. వాటిని పర్షియన్, మొఘల్ గార్డెన్స్‌గా రూపొందించారు. శ్రీనగర్‌లో ఉన్న ప్రజలు మాత్రం దానిని మొఘల్ గార్డెన్స్‌గా పిలుస్తుంటారు. ఎందుకంటే అది వారికి ప్రేరణగా ఉండిందని అలా పిలుస్తుంటారు. అయితే ఎన్నడూ వాటిని ‘మొఘల్ గార్డెన్స్’ అని పిలువలేదు.
అమృత్ ఉద్యాన్ వెబ్‌సైట్ ప్రకారం ఆ ఉద్యానవనం 15 ఎకరాల మేరకు విస్తరించి ఉంది. తరచూ దానిని రాష్ట్రపతి భవనం కిందే పిలవడం ఆనవాయితీగా జరుగుతోంది. ‘ఉద్యాన్ ఉత్సవ్’ అనే వార్షిక వేడుక సందర్భంగా ఆ ఉద్యానవనాన్ని సామాన్య ప్రజల కోసం తెరచి ఉంచుతారు. ఆ వేడుకలు ఫిబ్రవరి నుంచి మార్చి మధ్య జరుగుతుంటాయి. అయితే రాష్ట్రపతి భవన్ మూడో సర్కూట్‌లో మొఘల్ గార్డెన్స్ ఉన్నాయి. అది ఆగస్టు నుంచి మార్చి వరకు తెరచి ఉంచనున్నట్లు రాష్ట్రపతి వెబ్‌సైట్ పేర్కొంది. ఈ సందర్భంగా బిజెపి ప్రతినిధి సంబిత్ పాత్రా ఓ ట్వీట్ చేశారు. ‘అమృత్‌కాల్ సందర్భంగా బానిస మనస్తత్వం వీడాలి’ అని పేర్కొన్నారు.
President Droupadi Murmu will grace the opening of the Amrit Udyan tomorrow. https://t.co/4rXOMlZXA3 pic.twitter.com/7WhgilMoWW
— President of India (@rashtrapatibhvn) January 28, 2023
Mughal Gardens at Rashtrapati Bhavan has been renamed as 'Amrit Uddyan' #AmritMahotsav #AmritUdyan https://t.co/UFGlp2zeks pic.twitter.com/EVpMIFY1SI
— 𝕂𝕒𝕦𝕤𝕙𝕒𝕝 𝔻𝕦𝕓𝕖𝕪 (@memewala_kd) January 28, 2023
‘अमृतकाल’ में ‘गुलामी की मानसिकता’ से बाहर आने के क्रम में मोदी सरकार का एक और ऐतिहासिक फैसला…
राष्ट्रपति भवन में स्थित “मुगल गार्डन” अब “अमृत उद्यान” के नाम से जाना जाएगा।#AmritUdyan pic.twitter.com/4NstQx7zML
— Sambit Patra (@sambitswaraj) January 28, 2023