Friday, December 20, 2024

హత్యాయత్నం కేసులో ఎంపీకి పదేళ్ల జైలు శిక్ష

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం : హత్యాయత్నం కేసులో ఒక ఎంపీకి పదేళ్ల జైలు శిక్ష పడింది. స్థానిక కోర్టు ఈమేరకు బుధవారం తీర్పు చెప్పింది. దీంతో ఎంపీ పదవికి ఆయన అనర్హుడు కానుండడంతో హైకోర్టును ఆశ్రయించనున్నారు. కేంద్ర పాతిత ప్రాంతమైన లక్షద్వీప్‌లో ఈ సంఘటన జరిగింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మహ్మద్ ఫైజల్ 2014 నుంచి ఎంపీగా ఉన్నారు. 2009లో షెడ్ నిర్మిస్తున్న బంధువైన మహ్మద్ సలీహ్‌పై కొంతమందితో కలిసి దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన సలీహ్ కొన్ని నెలల పాటు కేరళ లోని ఆస్పత్రిలో చికిత్స పొందాడు.

ఈ దాడికి సంబంధించి ఎన్సీపీ ఎంపి మహ్మద్ ఫైజల్‌తోపాటు 23 మందిపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ కేసులో ఆయన బెయిల్ పొందారు. ఈ కేసు విచారణ చేపట్టిన కవరత్తి కోర్టు బుధవారం తీర్పు ఇచ్చింది. ఎంపీ ఫైజల్‌తోపాటు మరో నలుగురిని దోషులుగా పేర్కొంది. వీరికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఎంపీ ఫైజల్, ఇతరులకు మంజూరైన బెయిల్‌ను రద్దు చేసింది. అయితే మహ్మద్ ఫైజల్ ఈ తీర్పు కారణంగా ఎంపీ పదవిని కోల్పోనున్నారు. అందుకని కేరళ హైకోర్టును ఆశ్రయించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News