Monday, December 23, 2024

కుక్కకు నూరీ పేరు పెడుతావా ?:మజ్లిస్ నేత

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : తల్లి సోనియా గాంధీకి రాహుల్ గాంధీ ఇచ్చిన ఆడ పెంపుడు కుక్క ఇప్పుడు వివాదాస్పదం అయింది. ఈ కుక్క పిల్లకు నూరీ అని పేరుపెట్టడం ముస్లింలను అవమానించడమే అవుతుందని ఆలిండియా మజ్లిస్ ఏ ఇత్తేహాదులు ముస్లిమీన్ నేత మెహమ్మద్ ఫర్హాన్ గురువారం విమర్శించారు. ఈ పేరు తమకు అభ్యంతరకరం అని ఎంపి అసదుద్ధిన్ సారధ్యపు పార్టీ తెలిపింది. రాహుల్ ఇటీవలి చర్యలు గర్హనీయం, సిగ్గుచేటుగా ఉంటున్నాయని ఫర్హాన్ పేర్కొన్నారు. దేశంలో పలు ముస్లిం కుటుంబాలలో కూతుళ్లకు నూరీ అనే పేరు ఉంటుందని, పెంపుడు కుక్కకు ఈ పేరు పెట్టడం గాంధీ కుటుంబానికి ముస్లింల పట్ల ఏ పాటి గౌరవం ఉందనేది తెలియచేస్తుందని మజ్లిస్ నేత స్పందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News