Friday, December 20, 2024

హుస్సాముద్దీన్‌కు స్వర్ణం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రతిష్టాత్మకమైన ఇంటర్ సర్వీసెస్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో తెలుగుతేజం మహ్మద్ హుస్సాముద్దీన్ స్వర్ణం సాధించాడు. మహారాష్ట్రలోని పుణె వేదికగా ఈ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో హుస్సాముద్దీన్ ఫైనల్లో గెలిచి పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఏకపక్షంగా సాగిన ఫైనల్లో హుస్సాముద్దీన్ 50 తేడాతో ఇండియన్ నేవికి చెందిన పిఎం మెటిను ఓడించాడు. ఆరంభం నుంచే పూర్తి ఆధిపత్యం చెలాయించిన హుస్సాముద్దీన్ అలవోక విజయంతో స్వర్ణం దక్కించుకున్నాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News