Tuesday, December 24, 2024

జూబ్లీహిల్స్ ఎంఐఎం అభ్యర్థిగా మొహమ్మద్ రషీద్ ఫరాజ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఎంఎల్‌ఎ అభ్యర్థిగా మొహమ్మద్ రషీద్ ఫరాజ్ పేరును ఎంఐఎం సోమవారం ప్రకటించింది. ఏడు సిట్టింగ్ స్థానాలతో పాటు జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్ నుండి పోటీ చేస్తున్నట్లు ఎంఐఎం ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆరుగురు అభ్యర్థులను ప్రకటించిన ఎంఐఎం తాజాగా మరో అభ్యర్థిని ప్రకటించింది. మరో రెండు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. కాగా జూబ్లీహిల్స్ నుండి రషీద్ ఫరాజ్ పేరును ఎక్స్ వేదికగా ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసి ప్రకటించారు.

ఈ స్థానం నుంచి అధికార బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్తిగా సిట్టింగ్ ఎంఎల్‌ఎ మాగంటి గోపినాథ్ పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ తరఫున టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ పోటీలో ఉన్నారు. బిజెపి నుంచి లంకల దీపక్ రెడ్డి పోటీ చేస్తున్నారు. రషీద్ ఫరాజ్ ప్రస్తుతం షేక్ పేట కార్పొరేటర్ గా ఉన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇప్పటివరకు బిఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి గోపినాథ్ రెండు సార్లు గెలిచారు. ఇప్పుడు మూడోసారి బరిలోకి దిగుతున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పిజెఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి పోటీ చేయగా ఓటమిపాలయ్యారు. ఈ నియోజకవర్గంలో ముస్లీం ఓట్లు కీలకం కానున్నాయి. మైనారిటీ ఓట్లు ఎక్కువగా ఎవరికి వేస్తే వారే గెలుస్తారని నమ్మకంతో ఎంఐఎం అభ్యర్థిని బరిలోకి దించినట్లు తెలుస్తోంది. మరో వైపు కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్ ను ఓడించేందుకు ఎంఐఎం అభ్యర్థిని ప్రకటించిందనే వాదన ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News