జవహర్‌నగర్ : ఉగ్రవాద సంస్థ హిజాబ్ ఉత్ తహ్రీల్ సంస్థతో సంబంధాలు పెట్టుకోని ఉగ్రవాద కార్యకలాపాలు చేస్తు పోలీసులకు పట్టబడ్డ మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్‌కు చెందిన మహమ్మద్ సల్మాన్(27) కుటుంబం గత 30 సంవత్సరాలుగా కార్పొరేషన్ పరిధిలోని విఘ్నేశ్వర కాలనీలో నివాసం ఉంటున్నారు.సల్మాన్ తండ్రి మహమ్మద్ యాకుబ్‌కు నలుగురు మగ సంతానం కాగా సల్మాన్ అందరికంటే చిన్నవాడు.వెల్డింగ్ పనులు చేస్తు అదే కాలనీలో ఉన్న మజీద్ వద్ద ఎక్కువగా ఉండేవాడని స్థానికులు తెలిపారు.మహమ్మద్ యాకుబ్‌కు హమీద్,సమీర్,హలీమ్,సల్మాన్ అనే నలుగురు సంతానం.అందరికంటే చిన్నవాడైన సల్మాన్ ఎవరితో కూడా ఎక్కువగా మాట్లాడేవాడు కాదని,ఈ విధమైన ఉగ్రవాద కార్యకాలాపాలు పాల్పడుతున్నాడన్న విషయం తెలుసుకున్న స్థానికులు భయాందోళనకు గురైనట్లు తెలిపారు.
ఈ విషయమై స్థానిక జవహర్‌నగర్ పోలీసులకు అడగగా తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు. ఉగ్రకదలికలతో ఉలిక్కిపడ్డ జవహర్‌నగర్ … ఏటిఎస్(యాంటీ టెర్రరిస్ట్ స్కాడ్)అధికారులు జరిపిన దాడులో పట్టుబడ్డ సల్మాన్ కుటుంబం జవహర్‌నగర్ కావడంతో ఈ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.యాకుబ్ కుటుంబంతో గత 30 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న వారిపై ఎవరికి ఎలాంటి అనుమానం రాకపోవడం,ఉదయం ఇంటి నుండి బయటకు వెళ్లి ఏ రాత్రికో తిరిగి ఇంటికి చేరుకునేవారు.కాలనీలో ఉన్న మజీద్ వద్ద వీరి కార్యకలాపాలు ఎక్కువ సాగిస్తున్నట్లు కాలనీ వాసులు మీడియాకు తెలిపారు.ఏటీఎస్ అధికారులు జరిపిన దాడుల్లో రెండు ఎయిర్‌గన్లు,పిల్లెట్లు,పిస్తోలు దొరికినట్లు సమాచారం.