Thursday, December 19, 2024

అమ్మా.. త్వరగా కోలుకో

- Advertisement -
- Advertisement -

షమి భావోద్వేగ ట్విట్

న్యూఢిల్లీ: ప్రపంచకప్‌లో అసాధారణ ఆటతో టీమిండియాను ఫైనల్‌కు చేర్చడంలో భారత స్పీడ్‌స్టర్ మహ్మద్ షమి కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఇదిలావుంటే భారత్‌ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో షమి తల్లి అనమ్ అరా తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో ఆమెను బంధువులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. కాగా, తన తల్లి త్వరగా కోలుకోవాలని కోరుతూ షమి భావోద్వేగా ట్విట్ చేశాడు. అమ్మా నువ్వంటే ఎంతో ఇష్టం. త్వరగా కోలుకుని ఇంటికి వచ్చేస్తావని ఆశిస్తున్నా అంటూ సోషల్ మీడియా పోస్ట్ పెట్టాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News