Wednesday, January 22, 2025

అప్పట్లో ఆటో తోలుకోమన్నారు: మహ్మద్ సిరాజ్

- Advertisement -
- Advertisement -

Mohammed Siraj about failure of IPL 2019

బెంగళూరు: కెరీర్‌లో తనకు ఎదురైన ఇబ్బందికర పరిస్థితులను టీమిండియా యువ ఫాస్ట్ బౌలర్, హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ అభిమానులతో పంచుకున్నాడు. సిరాజ్ ప్రాతినిథ్యం వహించే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిర్వహిస్తున్న పాడ్‌కాస్ట్ కార్యక్రమంలో అతను పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తన అనుభవాలను వివరించాడు. 2019 ఐపిఎల్ సీజన్‌లో తాను పేలవమైన ప్రదర్శన చేశానని, అప్పడూ అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొవాల్సి వచ్చిందని వాపోయాడు. ఆ సీజన్‌లో 9 మ్యాచ్‌లు ఆడిన తాను కేవలం ఏడు వికెట్లు మాత్రమే పడగొట్టానన్నాడు. తన ప్రదర్శనను అభిమానులు జీర్ణించుకోలేక పోయారన్నాడు. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా కొంత మంది ఘోరంగా అవమానించారన్నాడు. క్రికెట్‌ను వదిలేసి ఆటో తోలుకోమని కొందరూ సలహాలు కూడా ఇచ్చారన్నాడు. ఇది తనను ఎంతో బాధకు గురి చేసిందని సిరాజ్ పేర్కొన్నాడు. అయితే క్లిష్ట సమయంలో తనకు విరాట్ భాయ్ అండగా నిలిచాడన్నాడు. తనలో స్ఫూర్తి నింపాడన్నాడు. అతని సలహాలను పాటించడం వల్లే తన బౌలింగ్ గాడిలో పడిందన్నాడు.

Mohammed Siraj about failure of IPL 2019

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News