ముంబై: దక్షిణాఫ్రికాతో జరిగే చివరి రెండు టి20ల్లో పాల్గొనే టీమిండియాలో హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ జట్టులో చోటు సంపాదించాడు. వెన్ను నొప్పితో బాధపడుతున్న సీనియర్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా సౌతాఫ్రికా సిరీస్‌కు దూరమైన విషయం తెలిసిందే. బుమ్రా స్థానంలో సిరాజ్‌కు సెలెక్టర్లు చోటు కల్పించారు. మిగిలిన రెండు టి20ల కోసం బుమ్రాను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని బిసిసిఐ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. కాగా స్టార్ బౌలర్ బుమ్రా గాయంతో సౌతాఫ్రికా సిరీస్‌తో పాటు టి20 ప్రపంచకప్‌కు దూరమయ్యాడు. ఇక సౌతాఫ్రికా సిరీస్‌లో బుమ్రా బదులు సిరాజ్‌కు సెలెక్టర్లు అవకాశం కల్పించారు. మరోవైపు వరల్డ్‌కప్ జట్టులో స్థానం కోసం సీనియర్ బౌలర్ మహ్మద్ షమి, దీపక్ చాహర్‌ల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఇప్పటికే వీరిద్దరూ ప్రపంచకప్‌కు స్టాండ్‌బైలుగా ఎంపికైన విషయం తెలిసిందే. వరల్డ్‌కప్ టీమ్‌లో వీరిలో ఎవరికో ఒకరికి చోటు దక్కే అవకాశాలు అధికంగా ఉన్నాయి.
Mohammed Siraj replaces Jasprit Bumrah