Wednesday, January 22, 2025

బౌలింగ్ లో సిరాజ్, బ్యాటింగ్ లో గిల్ టాప్

- Advertisement -
- Advertisement -

ప్రపంచ కప్ క్రికెట్ టోర్నీలో అపజయమన్నదే లేకుండా దూసుకుపోతున్న ఇండియా, ఐసిసి వన్డే ర్యాంకింగ్స్ ను కూడా కొల్లగొట్టింది. అటు బౌలింగ్ లోనూ, ఇటు బ్యాటింగ్ లోనూ అగ్రస్థానాలను చేజిక్కించుకుంది. ఐసిసి ప్రకటించిన వన్డే ర్యాంకింగుల్లో బౌలింగ్ లో మహ్మద్ సిరాజ్, బ్యాటింగ్ లో శుభ్ మన్ గిల్ నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.

గిల్ 830 పాయింట్లతో అగ్రస్థానానికి ఎగబాకగా, బాబర్ ఆజమ్ (824 పాయిట్లు), క్వింటన్ డికాక్ (771), విరాట్ కోహ్లీ (770), డేవిడ్ వార్నర్ (743) వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. ఆప్గనిస్తాన్ ఓపెనర్ జద్రాన్ 12వ స్థానంలో ఉన్నాడు. ఇక భారత మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ 18వ స్థానానికి చేరుకున్నాడు.

బౌలర్లలో మహ్మద్ సిరాజ్ 709 పాయింట్లతో నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్ 694 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా (662), భారత స్పిన్నర్ కులదీప్ (661), పాక్ పేసర్ షహీద్ అఫ్రీదీ (658) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News