- Advertisement -
న్యూఢిల్లీ : వివాదాస్పద ట్వీట్‌ను పోస్ట్ చేసిన కేసులో అరెస్టయిన ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహ్మద్ జుబేర్ బెయిల్ కోసం సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మహ్మద్ జుబేర్‌కు ప్రాణహాని ఉందని , ఆయనకు పలువురి నుంచి బెదిరింపులు వస్తున్నాయని భద్రతపై ఆందోళన చెందుతున్నామని జుబేర్ న్యాయవాది సీనియర్ అడ్వకేట్ కొలిన్ గొన్‌సేల్వ్ సుప్రీం కోర్టుకు నివేదించారు. జుబేర్ బెయిల్ పిటిషన్‌ను స్వీకరించి తక్షణమే విచారణ చేపట్టాలని కోర్టును అభ్యర్థించారు. ఈ అంశాన్ని రిజిస్ట్రీలో లిస్ట్ అయిన మేరకు రేపు విచారిస్తామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.హిందూ సన్యాసులను అవమానిస్తూ ట్వీట్ చేసిన కేసులో జుబేర్‌ను గత వారం అరెస్టు చేసిన పోలీసులు ఆయనను యూపీ లోని సీతాపూర్ కోర్టులో సోమవారం ప్రవేశ పెట్టారు. కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించింది.
- Advertisement -