Sunday, January 19, 2025

లంచం తీసుకుంటూ ఎసిబికి పట్టుబడ్డ మహ్మదాబాద్ ఎస్ఐ

- Advertisement -
- Advertisement -

మహమ్మదాబాద్ : మహబూబ్‌నగర్ జిల్లా, మహమ్మదాబాద్ ఎస్‌ఐ సురేష్ రూ. 20 వేలు లంచం తీసుకుంటూ ఎసిబికి పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. పగడాల గ్రామానికి చెందిన ఒక యువకుడు అదే గ్రామానికి చెందిన మరో అమ్మాయిని ప్రేమించాడు. గత కొంతకాలంగా అమ్మాయి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకురావడంతో తప్పించుకొని తిరుగుతున్నాడు. దీంతో అమ్మాయి తన తల్లితో కలిసి వచ్చి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఎస్‌ఐ శిక్ష తగ్గింపు చేస్తానని, అందుకోసం రూ. 50 వేల లంచం ఇవ్వాలని, యువకుడి తండ్రిని డిమాండ్ చేశారు. అందుకు మధ్యవర్తుల ద్వారా రూ. 30 వేల రూపాయలు తీసుకున్నారు. శిక్షణ తగ్గింపు ఉండే విధంగా సెక్షన్లను తగ్గించి రిమాండ్‌కు పంపగా,

ఒక్కరోజు ఒత్తిడి చేయగా, విసిగిపోయి మహబూబ్‌నగర్ ఎసిబికి విషయం తెలిపారు. దీంతో ఆదివారం సాయంత్రం సుమారు 6.30 గంటల సమయంలో రూ. 20 వేల రూపాయలు లంచం తీసుకోవడానికి అదే పిఎస్‌లోని రైటర్ ఇస్మాయిల్‌ను పురమాయించారు. అయితే, అతను డైరెక్ట్‌గా తీసుకోకుండా పిఎస్ పక్కల గల జిరాక్స్ షాపులో ఇవ్వమని చెప్పారు. అదేవిధంగా యువకుడి తండ్రి అతనికి డబ్బులు ఇవ్వగా ఎసిబి డిఎస్‌పి శ్రీకృష్ణయ్య గౌడ్ ఆధ్వర్యంలో అధికారులు వల పన్ని పట్టుకున్నారు. అనంతరం జిరాక్స్ షాపు యజమాని మూస, రైటర్ ఇస్మాయిల్, ఎస్‌ఐ సురేష్‌పై కేసు నమోదు చేసి సోమవారం నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. ఈ దాడిలో ఎసిబి ఇన్స్‌పెక్టర్ లింగస్వామి, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News