Thursday, January 16, 2025

మీడియాకు మోహన్‌బాబు క్షమాపణలు

- Advertisement -
- Advertisement -

ఆస్పత్రిలో జర్నలిస్టుకు పరామర్శ, కావాలని దాడి చేయలేదని వివరణ, ఇంకా స్టేట్‌మెంట్ రికార్డు చేయలేదు: పోలీసులు

మన తెలంగాణ/సిటీ బ్యూరో: తన ఇంటి వద్దకు వచ్చిన జర్నలిస్టులపై దాడి చేసిన సినీనటుడు మోహన్‌బాబు మీడి యాకు క్షమాపణలు చెప్పారు. సినీనటుడు మోహన్‌బాబు, అతడి చిన్న కుమారుడు మనోజ్‌కుమార్ మధ్య విభేదాలు రావడంతో కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. వీటిని కవర్ చేసేందుకు వెళ్లిన జర్నలిస్టులపై మోహన్‌బా బు దాడి చేశాడు. ఓ జర్నలిస్టును కొట్టగా, అతడి బౌన్సర్లు దాడి చేయడంతో టివి వీడియోగ్రాఫర్‌కు గాయాలయ్యా యి. దీంతో జర్నలిస్టులు పహాడీషరీఫ్ పోలీసులకు ఫిర్యా దు చేయగా కేసు నమోదు చేశారు.

ఈ క్రమంలో ఆరోగ్యం బాగా లేకపోవడంతో మోహన్‌బాబు ఆస్పత్రిలో చేరి చికిత్స చేయించుకుని ఇంటికి చేరుకున్నారు. తాను కావాలని మీ డియాపై దాడి చేయలేదని ఓ లేఖలో పేర్కొన్నారు. అయి నా కూడా మీడియాకు మోహన్‌బాబు క్షమాపణలు చెప్పా లని జర్నలిస్టులు డిమాండ్ చేయయడే పలు ప్రాంతాల్లో ధర్నాలు చేశారు. ఈ క్రమంలోనే దాడిలో గా యపడి ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జర్నలిస్టు రం జిత్‌ను మోహన్‌బాబు ఆయన కుమారుడు విష్ణు ఆదివా రం పరామర్శించారు. ఆస్పత్రిలో రంజిత్‌తో మాట్లాడి తా ను కావాలని దాడి చేయలేదని క్షమాపణలు చెప్పారు. అ క్కడే ఉన్న రంజిత్ కుటుంబ సభ్యులతో మాట్లాడి రంజిత్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

మోహన్‌బాబు స్టేట్‌మెంట్ రికార్డు చేయలేదు

తాము మోహన్‌బాబు నుంచి ఎలాంఇ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయలేదని పహాడీషరీఫ్ పోలీసులు తెలిపారు. జర్నలిస్ట్‌పై దాడి చేయడంతో మోహన్‌బాబుపై హత్యాయ త్నం కేసు నమోదు అయింది. దీంతో ముందస్తు బెయిల్ కోసం మోహన్‌బాబు హైకోర్టును ఆశ్రయించారు. ఆయన మెడికేషన్‌లో ఉన్నట్లు తమకు సమాచారం అందించినట్లు పహడి షరీఫ్ పోలీసులు వెల్లడించారు. రెండు, మూడు రో జుల్లో తానే విచారణకు వస్తానని పోలీసులకు మోహన్ బా బు చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు విచారణ సమయం లో తన గన్ సబ్ మిట్ చేస్తానంటూ పోలీసులకు మోహన్ బాబు హామీ ఇచ్చారు. మంచు ఫ్యామిలీలో ఇటీవల కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.

ముఖ్యంగా మోహన్ బాబు చిన్న కుమారుడు, హీరో మంచు మనోజ్ వ్యవహార శైలితో ఆ కుటుంబంలో వివాదాలు చోటు చేసుకున్నట్లు స్ప ష్టమైంది. దీంతో మంచు మోహన్ బాబు వర్సెస్ మంచు మ నోజ్ అన్నట్లుగా పరిస్థితి మారింది. ఆ క్రమంలో చిన్న కు మారుడు మనోజ్‌ను ఉద్దేశించి మోహన్ బాబు ఆడియో క్లి ప్ రిలీజ్ చేశారు. మోహన్‌బాబుపై పహాడీషరీఫ్ పోలీసులు హత్యాయత్నం కింద కేసు నమోదు చేయడంతో అరెస్టు చే యనున్నట్లు తెలియడంతో ముందస్తు బెయిల్ కోసం మో హన్ బాబు కోర్టును ఆశ్రయించారు. కానీ ఆయనకు బెయి ల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. మరోవైపు మోహన్ బాబు అజ్జాతంలోకి వెళ్లారంటూ ఓ ప్రచారం జరగడంతో తాను అజ్జాతంలోకి వెళ్లలేదని.. ఇంట్లోనే చికిత్స పొందుతు న్నానని మోహన్ బాబు ఎక్స్ ఖాతా ద్వారా తెలిపారు. తన పై అసత్య ప్రచారం చేస్తున్నారంటూ ఆయన ఆవేదన వ్య క్తం చేశారు. కానీ ఇంతలో మోహన్ బాబు నుంచి తాము ఎలాంటి స్టేట్‌మెంట్ రికార్డు చేయలేదని పోలీసులు చెప్ప డం పలు సందేహాలకు తావిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News