Wednesday, January 15, 2025

తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దు.. మంచు ఫ్యామిలీలో గొడవపై మోహన్ బాబు

- Advertisement -
- Advertisement -

మంచు కుటుంబంలో విభేదాలంటూ వస్తున్న వార్తలను నటుడు మంచు మోహన్ బాబు ఖండించారు. ఆదివారం మంచు మోహన్ బాబు, ఆయన చిన్న కుమారుడు పరస్పరం పోలీస్ స్టేషన్ లో ఒక్కొరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నట్లు వార్తా కథనాలు వెలువడ్డాయి. దీంతో న్యూస్ క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో వెంటనే అలాంటిది ఏం జరగలేదని మంచు కుటుంబం ఒక ప్రకటన విడుదల చేసింది. మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొన్నారు. కొన్ని మీడియా చానల్స్ ఊహాజనితమైన వార్తలను ప్రసారం చేస్తున్నాయని.. ఎవిడెన్స్ లేకుండా వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మొద్దని స్పష్టం చేశారు.

కాగా, మంచు మనోజ్  మోహన్ బాబుపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఇవాళ ఉదయం వార్తలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. తనను తన తండ్రి కొట్టాడని, తన భార్యపై కూడా దాడి చేసినట్లు గాయాలతో పోలీస్ స్టేషన్ కు వెళ్లి మనోజ్ ఫిర్యాదు చేసినట్లు ప్రచారం జరిగింది. అంతేకాదు.. తన కొడుకు మనోజే తనపై దాడికి పాల్పడినట్లు మోహన్ బాబు కూడా పోలీసులకు ఫిర్యాదు చేసిట్లు వార్తలు రావడంతో సినీ సర్కిల్లో చర్చనీయాంశమైంది. దీంతో మంచు ఫ్యామిలీ స్పందించి క్లారిటీ ఇచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News