Monday, December 23, 2024

త్రివిక్రమ్ మూవీలో ప్రధాన పాత్రలో…

- Advertisement -
- Advertisement -

ప్రతి సినిమాలో ఒక పేరొందిన నటుడిని విలన్ గానో లేదా కీలకమైన పాత్రకోసమో తీసుకోవడం త్రివిక్రమ్ శైలి. అత్తారింటికి దారేది సినిమాలో తాత పాత్ర కోసం బొమ న్ ఇరానీని బాలీవుడ్ నుంచి రప్పించాడు. ఇప్పుడు సీనియర్ నటుడు మోహన్ బాబుకి ఒక కీలక పాత్ర ఇవ్వబోతున్నాడని టాక్. మహేష్ బాబుతో త్రివిక్రమ్ తీసే కొత్త సినిమాలో మెయిన్ రోల్ కోసం మోహన్ బాబు ని అడిగినట్లు తెలిసింది. ఇక సూర్య హీరో గా రూపొందిన ‘ఆకాశం నీ హద్దురా’ వంటి సినిమాల్లో కీలక పాత్రలో కనిపించ డం మినహా ఈ మధ్య చెప్పుకోదగ్గ సినిమా ల్లో ఆయన పెద్దగా నటించ లేదు. మరి మోహన్ బాబుపై త్రివిక్రమ్ దృష్టి ఎందుకు పడిందో? మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఇప్పటివరకు అతడు, ఖలేజా చిత్రాలు వచ్చాయి. ఈ మూడో చిత్రం ఈ ఏడాది ఏప్రిల్‌లో మొదలు కానుంది. హీరోయిన్‌గా పూజా హెగ్డే ఖరారైంది. మరో హీరోయిన్‌గా సంయుక్త మీనన్ పరిశీలనలో ఉందట.
Mohan Babu key role in Mahesh-Trivikram Movie?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News