Monday, January 20, 2025

చంద్రబాబుతో నటుడు మోహన్‌బాబు భేటి..

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడుతో ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్ బాబు మంగళవారం నాడు భేటీ అయ్యారు. ఈక్రమంలో హైదరాబాద్ నగరంలోని చంద్రబాబు నివాసంలో నటుడు మోహన్‌బాబు దాదాపు 2 గంటల పాటు ఆంధ్రప్రదేశ్ తాజా రాజకీయాలపై చర్చించినట్లు సమాచారం.కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న మోహన్ బాబుతో చంద్రబాబుతో భేటి కావడం అటు సినీ వర్గాల్లో ఇటు ఎపి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన మోహన్ బాబు ఎన్నికల్లో పార్టీ నుంచి ఎలాంటి అవకాశం దక్కకున్నా పార్టీలోనే కొనసాగారు. ఈ క్రమంలో ఇటీవల కాలంలో వైఎస్సార్ సిపితోనూ దూరం పెంచుకున్న మోహన్ బాబు తాను రాజీనామా చేస్తున్నానని, ఇకపై రాజకీయాల జోలికి వెళ్లనంటూ ప్రకటించి సంచలనం రేపారు. అంతేకాకుండా ఇటీవలే తాను బిజెపి సిద్ధాంతాలను అవలంబించే వ్యక్తిగా తనను తాను ఆయన ప్రకటించుకున్నారు. తాజాగా చంద్రబాబుతో మోహన్ బాబు భేటీ కావడం రాజకీయాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.

Mohan Babu meet with Chandrababu Naidu

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News