- Advertisement -
అమరావతి: తిరుపతిలో నిర్వహించిన లాఠీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నటుడు మోహన్‌బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులపై మోహన్ బాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వారి కోసమే ఐఎఎస్, ఐపిఎస్‌లు పని చేస్తారని, పోలీస్ ఉన్నతాధికారులు గవర్నమెంట్‌కు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. కానిస్టేబుల్స్ నిజం చెబితే వారి ఉద్యోగం పోతుందన్నారు. పోలీసులంటే తనకు గౌరవం ఉందని, కానీ నిజాన్ని ఎప్పుడూ నిర్భయంగా చెబుతానని మోహన్ బాబు తెలిపారు.
- Advertisement -