Friday, November 15, 2024

ఒడిశా సిఎంగా మోహన్ చరణ్ మాఝీ ప్రమాణస్వీకారం

- Advertisement -
- Advertisement -

ఒడిశా తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీ బుధవారం సాయంత్రం 5 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. ఉప ముఖ్యమంత్రులుగా కనకవర్ధన్ సింహ్‌దేవ్, ప్రవటి పరిదా ప్రమాణస్వీకారం చేశారు. ఒడిశా గవర్నర్ రఘుబీర్‌దాస్ వీరిచే ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్రమోడీ స్వయంగా హాజరయ్యారు. భువనేశ్వర్ లోని జనతా మైదాన్‌లో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్, గోవా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, అస్సాం, గుజరాత్, ఛత్తీస్‌గఢ్,

ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా 30,000 మంది ప్రజానీకం పాల్గొన్నారు. మాఝీ ఆహ్వానం మేరకు బిజూ జనతాదళ్ చీఫ్, మాజీ సిఎం నవీన్ పట్నాయక్ కూడా హాజరయ్యారు. అంతకు ముందు విలేఖరులతో కొత్త ముఖ్యమంత్రి మాఝీ మాట్లాడుతూ ఎన్నికల్లో బీజేపీ మ్యానిఫెస్టోలో పేర్కొన్న హామీలను వందరోజుల్లో అమలు చేయడానికి ప్రయత్నిస్తామని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో 24 ఏళ్లుగా పాలిస్తున్న బిజూజనతాదళ్ ప్రభుత్వం పరిసమాప్తమైంది. మొత్తం 147 స్థానాలకు బీజేపీ 78 స్థానాలనే సాధించగలిగింది. బీజేడీ 51 స్థానాలను, కాంగ్రెస్ 14 , సిపిఎం ఒకటి, ఇండిపెండెంట్లు మూడుస్థానాలను గెలుచుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News