Friday, December 27, 2024

మధ్యప్రదేశ్ సిఎంగా నేడు మోహన్ యాదవ్ ప్రమాణం

- Advertisement -
- Advertisement -

హాజరుకానున్న మోడీ, అమిత్ షా, యోగి

భోపాల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించి రాష్ట్ర రాజధాని భోపాల్‌లోని లాల్ పరేడ్ గ్రౌండ్‌లో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ పదవీ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్, తదితర ప్రముఖులు హాజరు కానున్నట్లు బిజెపి వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమానికి బిజెపి కార్యకర్తలు ముఖ్యంగా మోహన్ యాదవ్ సొంత నియోజకవర్గమైన ఉజ్జయిన్ నుంచి ఆయన అభిమానులు భారీ సంఖ్యలో హాజరు కానున్నట్లు వర్గాలు తెలిపాయి. వారం రోజులకు పైగా ఏర్పడిన ఉత్కంఠకు తెరదించుతూ సోమవారం మోహన్ యాదవ్‌ను బిజెపి శాసనసభా పక్షం ఏకగ్రీవంగా ఎన్నుకుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News