Monday, December 23, 2024

మోహన్ లాల్ ‘మలైకోట్టై వాలిబన్’ ఇంటెన్స్ ఫస్ట్ లుక్ విడుదల

- Advertisement -
- Advertisement -

కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ కొత్త చిత్రం ‘మలైకోట్టై వాలిబన్’ (మాలైకొట్టై కి చెందిన యువకుడు) ప్రకటన వచ్చిన దగ్గిరనుంచి అందరూ సినిమా గురించి ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అందుకు బ్రిలియంట్ డైరక్టర్ లీజో జోస్ పెల్లిసరీ ఈ చిత్ర దర్శకుడు కావడం మరో కారణం. విషు పర్వదినాన టీం చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది. ఒక యాక్షన్ సీక్వెన్స్ లో మోహన్ లాల్ ఇంటెన్స్ లుక్ ను ఫస్ట్ లుక్ గా విడుదల చేశారు. ఈ సీన్ తెరపై చూస్తున్నప్పుడు ఎంత ఉత్కంఠగా ఉండనుందో ఈ ఫస్ట్ లుక్ చూస్తే తెలుస్తుంది. జాన్ మేరీ క్రియేటివ్, సెంచురీ ఫిల్మ్స్, మాక్స్ ల్యాబ్ బ్యానర్ల పై షిబు బేబీ జాన్, కొచుమొన్, అనూప్ లు నిర్మాతలు గా సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. జనవరి 18న రాజస్థాన్ లోని జై సల్మెర్ లో ప్రారంభమైన షూటింగ్ అక్కడే కొనసాగుతోంది.

Also read: పవన్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి షెడ్యూల్ పూర్తి

ఎన్నో అంచనాలున్న ఈ చిత్రం గురించి ప్రేక్షకులు చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నారు. ఈ చిత్ర కథ గురించి రకరకాల కథనాలు ప్రచారంలో ఉండగా అవేవీ ‘ మలైకొట్టై వలిబన్’ కు సంబంధించినవి కావని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. హై బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం మలయాళం తో పాటుగా ఇతర ప్రముఖ భాషలన్నిటిలో విడుదల కానుంది. మధు నీలకందన్ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి పి ఎస్ రఫిక్ స్క్రిప్ట్ వర్క్ అందిస్తున్నారు. ప్రశాంత్ పిళ్ళై సంగీతం అందిస్తుండగా, దీపు జోసెఫ్ ఎడిటింగ్ బాధ్యతలు చూస్తున్నారు. ప్రతీష్ శేఖర్ పి ఆర్ ఓ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి తెలుగు పబ్లిసిస్ట్ గా బి ఏ రాజు ‘s టీం పని చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News