- Advertisement -
మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళల స్థితిగతులపై జస్టిస్ హేమ కమిటీ సమర్పించిన నివేదిక దేశ వ్యాప్తంగా సంచలనమైన సంగతి తెలిసిందే. నటీమణులంతా మీడియా ముందుకొచ్చి లైంగిక దాడులకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (అమ్మ) అధ్యక్ష పదవికి స్టార్ హీరో మోహన్‌లాల్ రాజీనామా చేశారు.
ఆయనతో పాటు 17 మంది సభ్యులు కూడా పదవుల నుంచి వైదొలిగారు. ఈ విషయాన్ని ’అమ్మ’ సంఘం అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ మూకుమ్మడి రాజీనామాల వల్ల మలయాళ చిత్రమండలిని రద్దు చేస్తున్నట్లు తెలిపారు. కొత్త పాలక మండలిని రెండు నెలల్లోగా సమావేశం నిర్వహించి ఎన్నుకోనున్నట్లు వెల్లడించారు.
- Advertisement -