Sunday, February 2, 2025

అట్టహాసంగా మొహర్రం వేడుకలు

- Advertisement -
- Advertisement -

పాతబస్తీలో ర్యాలీ ప్రారంభించిన మంత్రులు కొప్పుల, మహమూద్ అలీ
ఊరేగింపులో పాల్గొన్న లక్షలాది మంది నగర ప్రజలు

హైదరాబాద్ : నగరంలో మొహర్రం పర్వదిన వేడుకలను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. పాత బస్తీలో మొహర్రం ఊరేగింపును రాష్ట్ర ఎస్సీ సంక్షేమ, మైనారిటీ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్, హోమ్ మంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ తో పాటు పలువురు మైనారిటీ నేతలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. మత సమరస్యానికి వేడుకగా ఈ పండుగను జరుపుకున్నారు. శనివారం మధ్యాహ్నం ప్రారంభమైన బీబీకా ఆలం ఊరేగింపు మతగురువుల ప్రత్యేక ప్రార్థనల అనంతరం కాలి కబర్‌కు తరలి వెళ్ళింది. ఊరేగింపులో లక్షలాది ప్రజలు పాల్గొనగా బీబీకా ఆలం నుండి షేక్ ఫైసీ కమాన్, యూకుత్‌పురా దర్వాజా, మజిదే ఇత్తేబార్ చౌక్, అలీజాకోట్ల, సర్దార్ మహాల్ మీదుగా చార్మినార్‌కు చేరుకుంది.

చార్మినార్ పోలీస్‌స్టేషవ్ వద్ద వేసిన వేధికపైనుండి నగర పోలీస్‌కమీషనర్ సీవీ ఆనంద్,అదనపు కమీషనర్ విక్రం సింగ్‌మాన్,అదనపు కమీషనర్ ట్రాఫిక్ సుధీర్‌బాబు, ఎస్‌బి అదనపు కమీషనర్ విశ్వప్రసాద్,దక్షిణమండలం డిసిపి సాయి చైతన్య, చార్మినార్ ఎసిపి రుద్ర భాస్కర్లు ఆలంకు దట్టీలు సమర్పించారు. అనంతరం ఊరేగింపు గుల్జార్ హౌస్, ఇరానీ గల్లీ పెంజేషా మీదుగా ఖద్వే రసూల్‌కు చేరుకుని ఆనవాయితీ ప్రకారం అక్కడ కొద్ది సేపు ఊరేగింపును ఆపివేసి అనంతరం మీర్‌చౌక్, దారుల్‌షిఫాల మీదుగా చాదర్‌ఘాట్‌కు చేరుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News