Wednesday, January 22, 2025

మోహిత్ ఖాతాలో చెత్త రికార్డు

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన నిన్నటి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఘన విజయం సాధించింది. గుజరాత్ టైటాన్స్ పేలవమైన బౌలింగ్ చేయడంతో ఢిల్లీ గెలుపొందింది. ఢిల్లీ జట్టు మొదటి బ్యాటింగ్ చేసి గుజరాత్ ముందు 225 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. దీంతో గుజరాత్ 220 పరుగులు చేసి నాలుగు పరుగుల తేడాతో ఓటమిని చవి చూసింది. గుజరాత్ బౌలర్ మెహిత్ శర్మ తన ఖాతాలో చెత్త రికార్డును వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో అతడు నాలుగు ఓవర్లు వేసి వికెట్ తీయకుండా 73 పరుగులు సమర్పించుకున్నాడు. చివర ఓవర్‌లో రిషబ్ పంత్ బాదడంతో 31 పరుగులు ఇచ్చుకున్నాడు. 2018లో బెంగళూరు- హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్ ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్ బాసిల్ థంపి నాలుగు ఓవర్లలో వికెట్ తీయకుండా 70 పరుగులు ఇచ్చాడు. అతడిపై ఉన్న చెత్త రికార్డును మోహిత శర్మ తన ఖాతాలో వేసుకున్నాడు. మోహిత్ తన బౌలింగ్‌లో భారీ పరుగులు సమర్పించుకోవడంతో గుజరాత్ జట్టు ఓటమిపాలైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News