- Advertisement -
ఇరాన్ నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ తన వారసుడిగా రెండో కుమారుడు మోజ్తాబా ఖమేనీని నియమించినట్లు సమాచారం. ఇరాన్ అత్యంత రహస్యంగా ఈ ప్రకటనను వెల్లడించిందని సమాచారం.85 ఏళ్ల ఖమేనీ పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో, మోజ్తాబా ఇరాన్ సుప్రీం లీడర్ గా బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలిసింది. మోజ్తాబా గతంలో ఇరాన్ ప్రభుత్వంలో ఎలాంటి అధికారిక పదవినీ నిర్వహించలేదు. అయినప్పటికీ సుప్రీం లీడర్ గా ఆయన నియామకం దాదాపు ఖరారైంది. ఇక అలీ ఖమేనీ 1981లో ఇరాన్ అధ్యక్షుడయ్యాడు.
- Advertisement -