Sunday, December 22, 2024

నందమూరి వారసుడొచ్చాడు… మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ విడుదల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నందమూరి అభిమానులకు మోక్షజ్ఞ తన పుట్టిన రోజు సందర్భంగా గుడ్ న్యూస్ చెప్పారు. బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ సినిమాల్లోకి తొలి అడుగు వేశారు. యంగ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ నటిస్తున్నారు. ‘సింబా ఈజ్ కమింగ్’ అంటూ ఆయన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. దీంతో నందమూరి అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. గత రెండు రోజుల నుంచి ప్రశాంత్ వర్మ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఎంట్రీకి హింట్ ఇచ్చారు. యూనివర్స్ నుంచి కొత్త తేజస్సు రానుందని, వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే అద్భుత క్షణం ఇది అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. మోక్షజ్ఞ లుక్‌ను విడుదల చేసి తన తరువాత సినిమా హీరో అంటూ బాలయ్య వారసుడిని పరిచయం చేశారు. ప్రస్తుతం తన దగ్గర 20 స్క్రిప్ట్‌లు ఉన్నాయని, తొలి ఫేజ్‌లో ఆరుగురు సూపర్ హీరోలతో సినమాలు తీస్తానని ప్రశాంత్ వర్మ వివరణ ఇచ్చారు. ఏడాదికి ఒక సినిమా కచ్చితంగా విడదల చేయడానికి ప్లాన్ చేశానని, మోక్షజ్ఞతో చేస్తున్న సినిమా కథ గురించి అభిమానులు ఆసక్తి ఎదురుచూస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News