Saturday, November 30, 2024

చరిష్మాటిక్ స్టైలిష్ లుక్ లో మోక్షజ్ఞ

- Advertisement -
- Advertisement -

విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు మనవడు, అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ కుమారుడు నందమూరి మోక్షజ్ఞ, హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించే క్రేజీ ప్రాజెక్ట్‌తో గ్రాండ్‌గా సినీ అరంగేట్రం చేయబోతున్నారు. మోక్షజ్ఞ తొలి చిత్రం ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (పివిసియు)లో భాగం అవుతుంది. మరచిపోలేని నటనతో అలరించడానికి మోక్షజ్ఞ నటన, ఫైట్లు, డ్యాన్స్‌లలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు.

ఈ నేపథ్యంలో మోడరన్, స్టైలిష్ లుక్‌లో అద్దంలోకి చూస్తున్న మోక్షజ్ఞ కొత్త స్టిల్ విడుదలైంది. ఈ స్టిల్ అతని నేచురల్ చరిష్మాను చూపిస్తోంది. పర్ఫెక్ట్ స్టైల్ చేసిన హెయిర్, గడ్డంతో, చెక్ షర్ట్ ధరించి అద్భుతంగా కనిపించారు. ఎం.తేజస్విని నందమూరి సమర్పకులుగా, లెజెండ్ ప్రొడక్షన్స్‌తో కలిసి ఎస్‌ఎల్‌వి సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌ను నిర్మించనున్నారు. మోక్షజ్ఞ పుట్టినరోజున ప్రకటించిన ఈ చిత్రం ఇప్పటికే సంచలనం సృష్టించింది. పౌరాణిక ఇతిహాసం నుంచి ప్రేరణ పొందిన ఈ చిత్రం ప్రీ- ప్రొడక్షన్ చివరి దశలో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News