- Advertisement -
అమరావతి: ఓ వివాహితను బంధించి నెల రోజుల పాటు అత్యాచారం చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు ప్రాంతం వెదురు కుప్పం మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… దళిత వర్గానికి చెందిన ఓ మహిళ ఓ ప్రైవేట్ పాఠశాలలో పారిశుద్ధ కార్మికురాలిగా పని చేస్తుంది. నవంబర్ 17న ఓ వ్యక్తి ఆమె పని చేస్తున్న పాఠశాలకు వచ్చి బ్యాంక్ లోన్ ఇప్పిస్తానని బలవంతం చేసి లాక్కెళ్లాడు.
ఆమె ప్రతిఘటించిన కూడా బెదిరించడంతో పాటు దాడి చేసి ఆమెను ద్వి చక్రవాహనంపై తీసుకెళ్లాడు. గుర్తు తెలియని ప్రాంతంలో మహిళను ఓ రూమ్‌లో బంధించి ఆమెపై ఐదు రోజుల పాటు అఘాయిత్యం చేశాడు. అలా కొన్ని రోజుల తన వద్ద ఉంచుకొని ఆమెపై లైంగిక దాడి చేసి అనంతరం ఆమె గ్రామంలో విడిచివెళ్లిపోయాడు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోలేని బాధితురాలు వాపోయింది.
- Advertisement -