Sunday, February 23, 2025

సోమవారం రాశి ఫలాలు (17-02-2025)

- Advertisement -
- Advertisement -

మేషం – వృత్తి- ఉద్యోగాలలో కొన్ని అనుకోని మార్పులు వస్తాయి. అనవసరమైన  పరిశీలనలు ఉండుటవలన ప్రశాంతత తగ్గుతుంది. పిల్లల విద్యా విషయమై ప్రత్యేక శ్రద్ధను చూపాలి అనే ధోరణి మీలో ఏర్పడుతుంది

వృషభం –  వృత్తి – వ్యాపారాలు. రాజకీయపరమైన వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆత్మీయుల వలన మానసికంగా కొంత అశాంతి ఏర్పడుతుంది. ఆర్థిక పరిస్థితులు ఆశించిన స్థాయిలో ఉండవు.

మిథునం –  ఆర్థిక పురోగతి బాగుంటుంది. బయట జరుగుతున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సంతానానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించుకుంటారు.

కర్కాటకం – కోపతాపాలకు దూరంగా ఉండండి. పనుల్లో కొంత జాప్యం జరిగిన పూర్తి చేయగలుగుతారు. ఇంటా బయటా  కొంత అనుకూలంగా ఉంటుంది. అందరిలోనూ ప్రత్యేక గుర్తింపు పొందగలుగుతారు.

సింహం – చాలాకాలంగా రావలసిన మొండి బకాయిలు వసూలు అవ్వడం మీ చేతికి కొంత ధనం అందడం మీ ఆనందానికి కారణం అవుతుంది. పుణ్య క్షేత్రాలను సందర్షించుకుంటారు.

కన్య –  ముఖ్యమైన వ్యవహారాలు త్వరితగతిన పూర్తి చేస్తారు. కాలానికి అనుగుణంగా మనల్ని మనం మార్చుకోవాలనే  ధోరణి మీలో ఏర్పడుతుంది. వివాహ సంబంధ విషయాలు అనుకూలిస్తాయి.

తుల – ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంత నిరాశ ఏర్పడవచ్చు. బంధువులతో ఏర్పడిన విభేదాలు పరిష్కారం చేసుకోగలుగుతారు కుటుంబాన్ని క్రమక్రమంగా వృద్దిలోకి  తీసుకురావాలని అహర్నిశలు శ్రమిస్తారు.

వృశ్చికం – వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు గడిస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ముఖ్యమైన పనులు సాఫీగా సాగుతాయి. ఇంటా బయటా అనుకూలంగా ఉంటుంది.

ధనుస్సు-  ఆదాయం మార్గాలను ఎలాగైనా పెంచుకోవాలని స్నేహితులతో సన్నిహితులతో చర్చలు సాగిస్తారు ఇతరులు చేయవలసిన శ్రమ మీరు చేయవలసి వస్తుంది. ఉద్యోగంలో మీ ప్రత్యేక శైలి నిలబెట్టుకుంటారు.

మకరం – కొన్ని విషయాలలో పట్టుదలగా వ్యవహరిస్తారు. చేతివృత్తి పనుల వారికి మంచి ఫలితాలు సూచిస్తున్నాయి. ఏ విషయంలోనూ అతి జోక్యం ఉండదు. మీ మాటను ధిక్కరించే వారిని మీరు లెక్క చేయరు.

కుంభం –  మీ వాళ్లను ఒక దారిలో పెట్టడానికి మీరు చేసే ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. శత్రువులతో వాదించే కన్నా కాలమే సమస్యలను పరిష్కరిస్తుందని మౌనంగా ఉండిపోతారు.

మీనం – చాలా కాలంగా ఎదుర్కొంటున్న సాంకేతిక ఇబ్బందుల నుండి బయటపడగలుగుతారు. ఆరోగ్య సమస్యలు కొంత ఇబ్బంది పెడతాయి. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News