Monday, December 23, 2024

సోమవారం రాశి ఫలాలు (18-12-2023)

- Advertisement -
- Advertisement -

మేషం – ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రగా వుంటుంది. చేపట్టిన పనులు సన్నిహితుల సాయంతో పూర్తి చేస్తారు. ఆరోగ్యం, వాహనాల విషయాలలో నిర్లక్ష్యం తగదు. సోదరుల నుండి ధనలాభం.

వృషభం – కుటుంబ సభ్యులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు. వివాదాలకు దూరంగా వుండండి. ప్రయాణాలు లాభిస్తాయి. కాంట్రాక్టులు లాభిస్తాయి. శుభవార్తలు.

మిథునం – ఆర్థిక పరిస్థితి అంతంత ఓ మోస్తరుగా  వుంటుంది. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సోదరుల నుండి కీలక సమాచారం అందుకొంటారు. వస్తు లాభం.

కర్కాటకం – కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. అనుకోని అవకాశాలు లాభిస్తాయి.

సింహం – రుణ వత్తిడుల నుండి బయటపడతారు. మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకంటారు. దూర ప్రాంతాల నుండి సమాచారం ఆనందం కలిగిస్తుంది. కాంట్రాక్టులు లాభిస్తాయి.

కన్య – వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. అనుకోని ప్రయాణాలు లాభిస్తాయి. క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. నూతన వస్తు, వస్త్రా కొనుగోలు.

తుల – ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా వుంటాయి. నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త వల్ల ఆనందం కలుగుతుంది. పనులు పూర్తి. సంతానంనకు విద్యావకాశాలు.

 

వృశ్చికం – కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. దూర ప్రయాణాలు లాభిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. సంగీత సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు.

ధనుస్సు – విందు, వినోదాలు. ఉద్యోగాలలో ప్రోత్సాహం. నూతన వస్తు, వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా వుండును.

మకరం – రుణాలు తీరుస్తారు. ఉద్యోగాలలో హోదాలు పొందుతారు. పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం. సంఘంలో గౌరవం పొందుతారు.

కుంభం – నూతన ఉద్యోగవకాశాలు పొందుతారు. ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొంటారు. ధనలాభం.

మీనం – కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వాహన సౌఖ్యం. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. శుభవార్తలు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News